365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్, ఆగస్టు 27, 2021: ఈ వినాయక చవితి సందర్బంగా నేచరల్ స్టార్ నాని తన అభిమానులను అలరించబోన్నారు. ఆయన హీరోగానటించిన కుటుంబ కథాచిత్రం టక్ జగదీశ్ విడుదలకు సిద్ధమైంది. చిత్రానికి సంబంధించిన టీజర్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో నేడు విడుదల చేసింది. ఈ చిత్రంలో తన పాత్రను నాని పరిచయం చేస్తూ అభిమానులకు టక్ జగదీశ్‌లోని యాక్షన్ కోణపు హింట్ అందిస్తారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 10, 2021న ఈ చిత్రం ప్రత్యేకంగా విడుదల కానుంది. వీడియోను ఇక్కడ చూడండి:
https://twitter.com/PrimeVideoIN/status/1431159189846446080?s=20
శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించారు. ఈ చిత్రంలో నాని, రీతూ వర్మ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించగా ఇతర కీలక పాత్రల్లో ఐశ్వర్య రాజేశ్, తిరువీర్,వైష్ణవి చైతన్య, దేవదర్శిని, డానియల్ బాలాజీ కనిపిస్తారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో 240 దేశాలు, ప్రాదేశికప్రాంతాల్లో సెప్టెంబర్ 10, 2021నుంచి టక్ జగదీశ్ ప్రసారం కానుంది.