365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ప్రయాగ్‌రాజ్,12 ఫిబ్రవరి, 2025: మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో ముకేశ్ అంబానీ తన కుటుంబ సభ్యులతో కలిసి పవిత్ర స్నానం చేశారు.

ఈ పవిత్ర యాత్రలో ముకేశ్ అంబానీతో పాటు, ఆయన తల్లి కోకిలాబెన్ అంబానీ, కుమారులు ఆకాశ్, ఆనంత్, కోడళ్ళు శ్లోకా, రాధికా, మనుమలు పృథ్వి, వేద, అక్కలు దీప్తి సల్గావ్కర్, నీనా కోఠారి, అలాగే అత్త పూర్ణిమాబెన్ దలాల్, మరదలు మమతాబెన్ దలాల్ పాల్గొన్నారు.

గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమం వద్ద, లక్షలాది యాత్రికులతో కలిసి అంబానీ కుటుంబం ఈ పవిత్ర స్నానాన్ని నిర్వహించింది.

Read this also.. Four Generations of Ambanis Take the Holy Dip at Maha Kumbh

Read this also..Googee Group Presents Telangana Fitness Festival by Shafi Sami Classic

Read this also.. HYSEA Hosts 32nd National Summit & Awards 2025: AI & Beyond..

నిరంజని అఖాడాకు చెందిన స్వామి కైలాషానంద గిరిజీ మహారాజ్ గంగా పూజను నిర్వహించారు.

అనంతరం, పరమార్థ్ నికేతన్ ఆశ్రమంలో స్వామి చిదానంద సరస్వతీ మహారాజ్ను ముకేశ్ అంబానీ కుటుంబం భక్తి పూర్వకంగా కలుసుకుని ఆశీస్సులు పొందింది.

ఈ సందర్భంగా ప్రసాదం, లైఫ్ జాకెట్లు కూడా పంపిణీ చేశారు.

మహా కుంభమేళా యాత్రికుల కోసం రిలయన్స్ ప్రత్యేక సేవలు

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మహా కుంభమేళా సందర్బంగా యాత్రికుల సేవలో ‘తీర్థ యాత్రి సేవ’ పేరుతో విస్తృత సేవలను అందిస్తోంది.

ఈ ప్రత్యేక కార్యక్రమం యాత్రికుల ప్రయాణాన్ని సులభతరం చేస్తూ, వారికి ఆధ్యాత్మిక అనుభవాన్ని మరింత తీపిగా మార్చుతోంది.

*అన్న సేవ (పౌష్టికమైన భోజనం)
*సంపూర్ణ వైద్య సేవలు
*భద్రతా రవాణా, మెరుగైన కనెక్టివిటీ
*పవిత్ర నదీ జలాల్లో భద్రత కోసం ప్రత్యేక చర్యలు
*ఆరోగ్యవంతమైన విశ్రాంతి కేంద్రాలు
*స్పష్టమైన మార్గదర్శక వ్యవస్థ
*పరిపాలన, పోలీస్, లైఫ్‌గార్డులకు మద్దతు

‘వీ కేర్’ తత్వంతో రిలయన్స్, మహా కుంభమేళాలో పాల్గొనే యాత్రికుల భద్రత, సంక్షేమం, సౌకర్యాలను మరింత మెరుగుపరచేందుకు నిస్వార్థ సేవలను అందిస్తోంది.