365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మార్చి 9,2022: ఆధునిక,ఆధీకృత బీర్ తయారీ కంపనీ, అమెరికన్ బ్రూ క్రాఫ్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తమ ప్రతిష్టాత్మక బ్రాండ్ బ్లాక్ బస్టర్ (బీబీ)ను తెలంగాణాలో విడుదల చేసింది. మార్కెట్ పరిశోధన,సృజనాత్మక బ్రూవింగ్ ప్రక్రియల ఆధారంగా ఆధీకృత రుచులతో బీర్‌ను తయారుచేయడంతో పాటుగా మార్కెట్‌లోఅందించాలనే తపనతో కంపెనీ తమ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
బ్లాక్ బస్టర్ బీర్ శ్రేణిలో ప్రస్తుతం బ్లాక్‌బస్టర్ లాగర్, బ్లాక్‌బస్టర్ స్ట్రాంగ్ ఉన్నాయి. బ్లాక్‌బస్టర్ లాగర్–తేలికైనది,సామాజిక సంభాషణలను మరింతగా వృద్ధి చేసే తాజాదనం అందిస్తుంది. బ్లాక్‌బస్టర్ స్ట్రాంగ్ – నగదుకు తగ్గ విలువ అందించే బ్రాండ్. ఇది అసలైన చిల్డ్ బీర్ రుచులను అందిస్తుంది. అమెరికన్ బ్రూ క్రాఫ్ట్స్‌తమ సొంతబీర్‌ను తెలంగాణాలోని సంగారెడ్డి,ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వద్దనున్న
అత్యాధునిక బ్రూవరీల వద్ద తయారుచేస్తుంది. బీరును అతి చిన్న బ్యాచ్‌లుగా చేయడాన్ని నమ్మడంతో పాటుగా ప్రతి బీరు రెసిపీ,రుచి పట్ల అమిత శ్రద్ధను చూపుతుంది.
ఈ ప్రక్రియ కారణంగా రుచి పరంగా అస్సలు రాజీపడకుండా డ్రింక్ నాణ్యత పట్ల పూర్తి నియంత్రణ సాధించేందుకు తోడ్పడుతుంది. అత్యున్నత నాణ్యత దిశగా చేసిన విస్తృత స్థాయి పరిశోధన ఫలితం ఈ బ్లాక్‌బస్టర్ బీర్. ఖచ్చితమైన రుచి, వాసన అందించేందుకు అత్యున్నత మాల్ట్స్ ను ఎంపిక చేసి బ్రూవింగ్ చేశారు.ఈ సందర్భంగా అమెరికన్ బ్రూ క్రాఫ్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ శ్రీ సత్య శివ అథీ మాట్లాడుతూ ‘‘తెలంగాణాలో బ్లాక్‌బస్టర్ బీర్ ను ఆవిష్కరిస్తుండటం పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాము. బీరు ప్రేమికులకు, దేశవ్యాప్తంగా బీరు తాగే వ్యక్తుల నడుమ సాటిలేని అనుభవాలను అందించాలనే లక్ష్యంతో ఈ బ్లాక్‌బస్టర్ బీర్
ఆవిష్కరించాము.
మార్కెట్‌లోకి మరిన్ని వేరియంట్ల బీర్లను పరిచయం చేయాలన్నది లక్ష్యం. అందువల్ల బీరు ప్రేమికులు భారతదేశంలో అత్యంత సృజనాత్మక బీరు బ్రూవర్ల నుంచి అత్యుత్తమ బీరు రుచి ఆస్వాదించగలరు.బ్లాక్‌బస్టర్ బీర్‌కు మేము చక్కటి సమీక్షలను చూశాము. రాబోయే కాలంలో మరింత ఆసక్తికరమైన అవకాశాలను
అందించగలమని ఆశిస్తున్నాము’’అని అన్నారు.అమెరికన్ బ్రూ క్రాఫ్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ నరేంద్ర తాయి మాట్లాడుతూ ‘‘తెలంగాణా
,ఏపీలలో రెండు అత్యాధునిక బ్రూవెరీలను ఏర్పాటుచేశాము. మా బోర్డుపై నిష్ణాతులైన బ్రూవర్లు చేరారు. వీరు
అత్యుత్తమ బ్ర్యూస్‌ను స్థిరంగా దేశంలోని బీరు ప్రేమికులకు అందించనున్నారు. బ్లాక్‌బస్టర్ బీర్, మా జాబితాలోని తొలి బీరు. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కేరళ, పాండిశ్చేరీ , గోవాలలో లభ్యమవుతుంది. ఈ సంవత్సరాంతానికి కనీసం 12 రాష్ట్రాలను చేరుకోవాలన్నది మా లక్ష్యం. మేము అసలైన మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ తీర్చిదిద్దడంలో భాగంగా మా చుట్టు పక్కల సమాజాలనుంచి అత్యుత్తమ ముడి పదార్థాలను సేకరించడంతో పాటుగా నిలకడగా వృద్ధి చెందే మోడల్‌ను నిర్మించాము. రాబోయే కాలంలో మరిన్ని బ్రాండ్లును పరిచయం చేయనున్నాము. తద్వారా మా ఉత్పత్తి జాబితాలో విస్తృతశ్రేణి ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురానున్నాము’’అని అన్నారు.