Tue. Dec 24th, 2024

-సెప్టెంబర్ ఒకటి నుంచి మూడు రోజులపాటు సదస్సు

-7వేల మందికి పైగా హాజరుకానున్న ప్రతినిధులు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూన్ 12,2023: అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్(ఆప్త)15 ఏళ్ల జాతీయ కన్వెన్షన్.. జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో..సెప్టెంబర్ ఒకటి నుంచి మూడు వరకు నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కొట్టే ఉదయ భాస్కర్, ఏ. బాబి ప్రకటించారు.

ఆదివారం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో వారు ప్రసంగించారు. ఆప్త ఏర్పడి 15ఏళ్ల అయిందని సుమారు పదివేల మంది కి పైగా స్కాలర్షిప్లు అందిస్తున్నదని నిర్వాహకులు తెలిపారు. https://ap-ta.org/

ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బు కోలా ఉదయభాస్కర్ కొట్టి, విజయ్ గుడిసె, గోపాల్ గుడిపాటి, అడ్డా బాబి తదితరులు మాట్లాడారు. ఈ సంవత్సరానికి ఆప్తా కన్వెన్షన్ కు సుమారు 7000 మంది సభ్యులు హాజరవుతారని భావిస్తున్నట్టు చెప్పారు.

రాష్ట్రంలో కమ్యూనిటీ లీడర్లకు, పాఠశాలలకు, దాతలకు, వ్యాపారవేత్తలకు, ఇతర వివిధ రంగాల ప్రముఖులకు ఆహ్వానాలు అందజేసినట్టు వారు వివరించారు. 15 ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ సంస్థ చదువు, సేవే పరమార్థంగా పనిచేస్తుందని తెలిపారు. మహిళా సాధికారత కోసం పనిచేస్తున్నట్టుగా వివరించారు.

అమెరికాకు వచ్చే వేలాదిమంది విద్యార్థులకు ఇమ్మిగ్రేషన్ సేవలు విద్య ఉపాధి సౌకర్యాలను కూడా కల్పించేందుకు తాము కృషి చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఆప్తా కన్వెన్షన్ కు ఆ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులందరూ తరలిరావాల్సిందిగా కోరారు.

తెలుగు సంఘాలు ఎన్ని ఉంటే అంత మేలు జరుగుతుందని అమెరికాలో ఎవరికీ పోటీ కాదని అందరం కలిసి మెలిసే పని చేస్తామని వారు చెప్పారు. https://ap-ta.org/

ప్రశ్నించుకుంటాం తప్ప ఒకరికి ఒకరు పోటీ కాదని అభిప్రాయాన్ని సబికులందరూ వ్యక్తం చేశారు. త్వరలో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాలలోనూ మీడియా సమావేశాలు నిర్వహించి తమ సదస్సు ఉద్దేశాలను వివరిస్తున్నట్టు తెలిపారు.

తెలుగు అంటే రెండు రాష్ట్రాలే కాదని ఐదు రాష్ట్రాలకుపైగా ప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్నారని తమిళనాడు, పాండిచ్చేరి, కర్ణాటక,తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని.. అమెరికాలోని ఇది సేవ కార్యక్రమాలను ఈ రాష్ట్రాల ప్రజలకు అందిస్తున్నట్టుగా తెలిపారు. సదస్సు కర్తవ్యాన్ని మర్చిపోకుండా సుమారు 500 మంది వాలంటీర్లు నిరంతరం పనిచేస్తున్నారని చెప్పారు. https://ap-ta.org/

error: Content is protected !!