365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జూలై 28,2025: భారతదేశంలో అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ZEE5లో ఓ అచ్చమైన, స్వచ్చమైన తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో ‘మోతెవరి లవ్ స్టోరీ’ అనే సిరీస్‌ రాబోతోంది. అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను శివ కృష్ణ బుర్రా రూపొందించారు.  

ఈ విలేజ్ కామెడీ, లవ్ సిరీస్ అందరినీ ఆకట్టుకునేందుకు ఆగస్ట్ 8న జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ అందరినీ మెప్పించింది. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను ఆదివారం నాడు తరుణ్ భాస్కర్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

“Mothevari Love Story” Trailer – https://youtu.be/vMbU3-TUXRg

‘ఇగో ఇదే మా ఊరు.. ఆరె పల్లి.. ఊరుఊరుకో మోతెవరి ఉన్నట్టు.. మా ఊరికి ఓ మోతెవరి ఉన్నడు..’ అంటూ ప్రియదర్శి వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం వినోదభరితంగా సాగింది. హీరో అనిల్ పరిచయం, హీరోయిన్ వర్షిణితో లవ్ ట్రాక్, ఊర్లోని పెద్దలు, భూ సమస్య, ప్రేమ వంటి అంశాలతో ట్రైలర్‌ను చక్కగా కట్ చేశారు.

ఈ ట్రైలర్‌ను చూస్తుంటే ఈ సిరీస్‌ను ఆద్యంతం వినోద భరితంగా మలిచారని అర్థం అవుతోంది. ‘పర్శిగాడంటేనే పర్‌ఫెక్ట్’, ‘ఉశికే ఉడికించుడే’ అనే డైలాగ్స్ నవ్వులు పూయించేలా ఉన్నాయి.

Read This also…“Mothevari Love Story” Trailer Unveiled: ZEE5 Brings a Rustic Tale of Love, Laughter, and Land Disputes..

‘అమ్మాయిలు భలేగా ఉంటరే.. మోసాన్ని కూడా ముద్దుగ చెప్తరే’ అంటూ సాగే డైలాగ్ ఎమోషనల్ డెప్త్‌ను కూడా చూపిస్తోంది. ఆగస్ట్ 8న ఈ సిరీస్ అందరినీ అలరించేందుకు రాబోతోంది.

ఈ సిరీస్‌కు చరణ్ అర్జున్ సంగీతాన్ని అందించగా.. శ్రీకాంత్ అరుపుల కెమెరామెన్‌గా పని చేశారు. మధుర శ్రీధర్, శ్రీరామ్ శ్రీకాంత్ సంయుక్తంగా నిర్మించిన ఈ సిరీస్‌‌‌లో అనిల్ గీలా, వర్షిణి, మురళీధర్, సదానందం, సుజాత వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు.