365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, జూలై 20,2021: భారతదేశంలోని ఫ్రంట్‌లైన్ రిటైల్ యోధుల అంకితభావం మరియు నిస్వార్థ సేవలను ప్రశంసిస్తూ, ఆసియాలోని ప్రముఖ వాణిజ్య వేదికలలో ఒకటైన పైన్ ల్యాబ్స్ మల్టీ ఛానెల్ మార్కెటింగ్ ప్రచారాన్ని ప్రారంభించింది.ఈ క్యాంపెయిన్‌లో భాగంగా విడుదలవుతున్న ఈ చిత్రం, మహమ్మారి సమయంలో కిరాణా స్టోర్ల యజమానులు, రిటైల్ ఫార్మసిస్ట్‌లు, వ్యాపారి జీవితాలను ప్రతిబింబిస్తుంది. దేశంలోని అన్నిప్రాంతాల ప్రజలను ఇళ్లలోనే సురక్షితంగా ఉంచేందుకు వీరు ఎదుర్కొన్న ముప్పు, తీసుకున్న శ్రమ,అలసటలను ఈ చిత్రం అభివర్ణిస్తుంది. వారందరికీ కృతజ్ఞతల వ్యక్తీకరణ- “మాకు చీకటిగా ఉన్నసమయంలో, దీపాలు వెలిగించినందుకు మీకు ధన్యవాదాలు” అనే నినాదంతో ముగుస్తుంది.
పైన్ ల్యాబ్స్ ఈ చిత్రాన్ని పలు డిజిటల్ ప్లాట్‌ఫారాలపై ప్రదర్శించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ చిత్రాన్ని ఇక్కడ చూడవచ్చు: https://youtu.be/bMHUf5UwBHA
పైన్ ల్యాబ్స్ తన నెట్‌వర్క్‌లోని ప్రతి వ్యాపారి, దృఢ చిత్తానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, పర్సనలైజ్ చేసిన వీడియోను కూడా పంపించింది. మొట్టమొదటి మార్కెటింగ్ ఆవిష్కరణలో, పైన్ ల్యాబ్స్ మైక్రోసైట్‌ను ప్రారంభిస్తుండగా, ఇక్కడ ఎవరైనా మహమ్మారి సమయంలో తమకు అండగా నిలిచిన వారికి అంకితం చేస్తూ, పర్సనలైజ్ చేసిన వీడియోను పంపించుకునేందుకు అవకాశం కల్పిస్తుంది.
‘‘కొవిడ్-19 మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి వెలుగులోకి రాని హీరోల్లో ఫ్రంట్‌లైన్ రిటైల్ యోధులు, దుకాణాల యజమానుల, వారి సిబ్బంది ఉన్నారు. దేశంలో లాక్‌డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి నేటి మైక్రో లాక్‌డౌన్ల వరకు, ఈ సంక్షోభ సమయంలో వారు తమ సేవలనుఅందిస్తూనే ఉన్నారు. మా చిత్రం వారి రోజువారీ పని జీవితాలను, వారు న్యూ నార్మల్‌కుఅనుగుణంగా ఎలా మారారో తెలుసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి ఇస్తుందని, మన దేశాన్ని ముందుకు నడిపించడంలో రిటైల్ వ్యాపారులు చేస్తున్న ప్రయత్నాలనుమరింత స్పృహతో అభినందనలు తెలియజేస్తూ, ప్రోత్సహిస్తుందని మేము ఆశిస్తున్నాము’’ అని పైన్ ల్యాబ్స్ సీఈఓ బి. అమ్రిష్ రౌ పేర్కొన్నారు.‘‘మార్చి 2020లో కొవిడ్-19 లాక్‌డౌన్ ప్రారంభమైనప్పుడు, మేము వివిధ స్వచ్ఛంద సంస్థలకు రూ.1కోటిని విరాళంగా అందజేశాము. రిటైల్ రంగంలో ఫ్రంట్‌లైన్ స్టోర్ కార్మికుల ఉద్యోగ రక్షణకు ఈ ఏడాది మేము రూ.1.25 కోట్లను అందించేందుకు కట్టుబడి ఉన్నాము. మనం ఎంత ఎక్కువ చేసినా, అది చాలా తక్కువే అని అర్థం చేసుకోవాలి! రిటైల్ రంగంలో పని చేసేవారు మహమ్మారి సమయంలో ప్రశంసనీయమైన సేవలు అందించగా, మనం వారి ప్రయత్నాలను, శ్రమను గుర్తించాలి. మా మార్కెటింగ్ బృందం చేసిన ప్రయత్నాలు నాకు సంతోషాన్ని కలిగించాయి.
ఈ చిత్రం ద్వారా ఈ ఫ్రంట్‌లైన్ రిటైల్ యోధుల రోజువారీ పోరాటాలను ప్రతి ఒక్కరి ముందుకు తీసుకు ఎలా తీసుకువచ్చారో తెలుస్తుంది’’ అని పైన్ ల్యాబ్స్ అధ్యక్షుడు & సీఓఓ నితీష్ అస్తానా తెలిపారు.మహమ్మారి సమయంలో, వినియోగదారుల ప్రవర్తనల్లో మార్పులతో, కొనుగోళ్ల అనంతరం కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల్లో వృద్ధి కనిపించింది. జనవరి 2021లో ప్రారంభించిన పైన్ ల్యాబ్స్ ఆల్ టాప్ యాప్ వినియోగించడాన్ని ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో చూడవచ్చు. న్యూనార్మల్‌లోసురక్షితమైన,వేగవంతమైన లావాదేవీల కోసం కాంటాక్ట్‌లెస్ మొబైల్ చెల్లింపులను స్వీకరించేందుకు రిటైల్ దుకాణాలు, ఫార్మసీలు, కార్మిక వర్గాలకు చెందిన ట్యూటర్లు,హోమ్ ఫుడ్ అందించే వారు ఒక వ్యక్తి వ్యాపారి తదితర ఇతర విభాగాల యజమానులకు ఇది సాధికారతను అందించింది. దీన్ని 100,000 పైచిలుకు ఇన్‌స్టాల్ చేసుకోగా, నిత్యం దీన్ని డౌన్‌లోడ్ చేసుకునే వారి సంఖ్య కొనసాగుతుండగా, పైన్ ల్యాబ్స్ ఆల్‌టాప్ యూపీఐ, కార్డ్, వాలెట్, లింక్-ఆధారిత చెల్లింపులనుఅంగీకరించేందుకుసహాయపడుతుంది,కాంటాక్ట్‌లెస్ ద్వారా ‘చెల్లించేందుకు టాప్ చేయండి’ .విధానం ద్వారా రూ.5,000 వేల వరకు కార్డు చెల్లింపులను అనుమతిస్తుండగా, ఇది వినియోగదారుడుతన కార్డును వ్యాపారి వద్ద ఉన్న NFC-ఆధారిత ఆండ్రాయ్ స్మార్ట్ ఫోన్‌పై ట్యాప్ చేయడం ద్వారాచెల్లింపును పూర్తి చేయవచ్చు.
క్రెడిట్స్:క్రియేటివ్ టీమ్- ప్రవీణ్ బాలచందర్, హితేష్ రజ్దాన్, రాగిణి దత్తా
బ్రాండ్ మేనేజర్ – సరహనా సంచయ్
ప్రొడక్షన్ – ఫుట్‌లూస్ ఫిల్మ్స్
దర్శకుడు: ఇంద్రసిష్ ముఖర్జీ