మొత్తం కామన్వెల్త్ దేశాలు ఇంగ్లాండ్ తో కలుపుకొని 54 దేశాలు. అంటే మిగిలిన 53 దేశాలను బానిసలుగా మార్చుకుని, అన్ని రకాలుగా దోచుకుని ఇంగ్లాండు పరిపాలించింది. రెండో ప్రపంచ యుద్ధంలో పైకి గెలిచినప్పటికీ జర్మనీ చేతిలో చావుదెబ్బలు తిన్న ఇంగ్లాండ్ చాలా బలహీనపడింది. 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. అప్పటికే అన్ని కామన్ వెల్త్ దేశాలకు స్వాతంత్య్రం ఇవ్వల్సిన తప్పనిసరి పరిస్థితి వచ్చేసింది. అన్ని దేశాలలో వివిధ స్థాయిలలో పనిచేస్తున్న బ్రిటిష్ పౌరులను జాగ్రత్తగా వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి.
అప్పటికి ఇంకా ఆయా దేశాలలో అక్కడే దోచుకుని, దాచుకుని ఉన్న సంపదను ఉన్నంతలో జాగ్రత్తగా ఇంగ్లాండ్ కి తరలించుకోవాలి. ఇంగ్లండ్ పరిపాలన లో ఉన్న 53 కామన్వెల్త్ దేశాలకు అన్నిటికీ దాదాపుగా 5 సంవత్సరాల వ్యవధిలో ఫ్రీడమ్ వచ్చింది. భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ ద్వారా స్వాతంత్య్రం వచ్చిందా ?
లేకపోతే ఆ పార్టీ కారణంగానే స్వాతంత్య్రం ఆలస్యంగా వచ్చిందా ?
కేవలం భారత దేశం మాత్రమే ఎందుకు మత ప్రాతిపదికన ముక్కలు చేయబడింది.? దేశ విభజన తప్పదు అనుకునే పక్షంలో, దానికి ప్రతిపాదించింది ఎవరు ? ఒప్పుకున్నది ఎవరు ? దానికి సంబంధించిన నిర్దుష్ట విధివిధానాలు ఎందుకు రూపొందించలేక పోయారు ? డైరెక్ట్ యాక్షన్ డే (ప్రత్యక్ష చర్య) అంటే ఏమిటి? ఎవరు పిలుపిచ్చారు? ఎందుకోసం ఇచ్చారు ? 1947 లో ప్రధానమంత్రి పదవికి వల్లభ్ భాయ్ పటేల్ గారు ఎన్నికయితే ( 15 ఓట్లలో 12 ఓట్లు గెలిచారు ) , ఒక్క ఓటు కూడా రాని నెహ్రూని దొంగ దారిలో ఈ దేశంపై మహాత్మ నాయకుడు ప్రధానమంత్రిగా ఎందుకు రుద్దారు ? ( ఆ విధంగా మనదేశంలో స్వాతంత్య్రం వచ్చిన వెంటనే మొదటి సారిగా ప్రజాస్వామ్యం హత్య కావడం జరిగింది )
దేశ విభజనలో అమాయక హిందువులు లక్షలాది మంది ఎందుకు ప్రాణాలు పోగొట్టుకోవలసి వచ్చింది ? పాకిస్థాన్ కు ఇచ్చివేసిన భూభాగం నుంచి లక్షలాది మంది హిందువులు అక్కడ తమ ఆస్తులు వదులుకుని తమ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని భారత దేశానికి ఎందుకు పారిపోయి వచ్చారు ? దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బాగా లాభ పడింది ఎవరు ? మోస పోయింది ఎవరు ? అనే ఆసక్తికర అంశాలు మేడిశెట్టి కాలమ్ దేశ విభజనలో ఎవరిది పాపం ? ఎవరికి శాపం ? (part-1)..లో తెలుసుకుందాం..
గమనిక : ఇవన్నీ రచయిత అభిప్రాయాలు మాత్రమే..365telugu.com కు సంబంధం లేదు.