
365తెలుగు డాట్ కామ్ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,జులై 15,2022:అప్పలాయ గుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జులై 15వ తేదీన జరుగనున్న పుష్పయాగానికి గురువారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.

ఉదయం ఆచార్య ఋత్విక్‌వరణం జరిగింది. సాయంత్రం 6.30 నుంచి అంకురార్పణం నిర్వహించారు ఇందులో భాగంగా మేదినిపూజ, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ చేపట్టారు.

జులై 15వ తేదీ శుక్రవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.50 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగం జరుగనుంది. సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు పెద్దశేష వాహనంపై స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు.