365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నవంబర్ 25,2023: సరూర్ నగర్ లోని పల్లవిఅవేర్ ఇంటర్నేషనల్ స్కూల్లో 2023, నవంబర్ 25న వార్షిక దినోత్సవం ‘రసాగ్న్యా- ది నవరస’ను ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికిహాజరైన ముఖ్య అతిథిటాలెంట్ 21 మేనేజ్మెంట్ సీఈఓ కమ్ ఫౌండర్ శ్రీ గురీందర్‌పాల్ సింగ్సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ హానర్‌తో కార్యక్రమం ప్రారంభమైంది.

ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సీఓఓ శ్రీ మల్కా యశస్వి, అకాడమిక్స్ డైరెక్టర్ శ్రీమతి సుధా తురగ, స్కూల్ డైరెక్టర్ శ్రీమతి అనిత రెడ్డి మరియు ప్రిన్సిపాల్ శ్రీమతి చారు జైన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

విద్య, క్రీడలు, సాంస్కృతిక రంగాలలో సాధించిన వారిని ఈ సందర్భంగా సన్మానించారు. విద్యార్థులు నృత్యాలు, పాటలు, నాటక ప్రదర్శనల ద్వారా తమ ప్రతిభను ప్రదర్శించారు.

సంప్రదాయ దుస్తులు, లయబద్ధమైన సంగీత దరువులు, కళాకారులత ఉత్సాహంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించాయి. కార్యక్రమ విశేషాల కళావైభవానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉర్రూతలూగారు.

చివరగా ప్రిన్సిపాల్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది.