365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఏప్రిల్ 3,2023: పుస్తకాలు జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. సాంస్కృతిక కార్యక్రమాలు జ్ఞానంతో పాటు విజ్ఞానం, వినోదాలను అందిస్తాయి. ఆ రెండింటి కలయికే నాదర్గుల్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన కార్యక్రమం.
విద్యారంగంలో అంచలంచెలుగా ఎదుగుతూ.. తమదైన నూతన విద్యా విధానాలను అనుసరిస్తూ.. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నపాఠశాల ఢిల్లీ పబ్లిక్ స్కూల్, నాదర్గుల్ లో ఆదివారం జరిగిన రెండో రోజు వార్షికోత్సవ వేడుకలో విద్యార్థులు తమ ప్రతిభతో అతిథులను ఆకట్టుకున్నారు.
ఈ కార్యక్రమానికి పాఠశాల చైర్మన్ మల్కా కొమరయ్య, పల్లవి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ సీఓఓ మల్కా యశస్వి, మేనేజింగ్ కమిటీ ఆఫ్ డీపీఎస్ బాలాజీ అరుణ్, విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు.
అలాగే దీనికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఎనర్జీ డిపార్ట్మెంట్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ (ఐఏఎస్) విచ్చేశారు. అలాగే పద్మశ్రీ అవార్డ్ గ్రహీత పసుపులేటి హనుమంత రావు, డి.ఆర్.డి.ఓ సైంటిస్ట్ డాక్టర్ కె.వీర బ్రహ్మం గౌరవ అథితులుగా హాజరయ్యారు.

నేటి తరం విద్యార్థులు అన్ని రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్నారని, చదువుతో పాటు క్రీడా, సాంస్కృతిక రంగాల్లో ప్రత్యేక ప్రతిభ కనబరచడం గొప్ప విషయమని ఐఏఎస్ ఆఫీసర్ సునీల్ శర్మ అన్నారు.
అలాగే విద్యార్థులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను, ముఖ్యంగా విద్యార్థులను ఉత్తమ పౌరులను భావి తరాలకు అందిస్తున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమదైన శైలిలో అభినయిస్తూ చేసిన నృత్యాలు అక్కడున్న వారందర్నీ ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రినిపాల్ పద్మ జ్యోతి తురగా, వైస్ ప్రిన్సిపాల్ నాగ లక్ష్మి, హెడ్మాస్టర్ ఇంద్రిత, లక్ష్మి శిరీషతో పాటు స్కూల్ స్టాఫ్ అంతా పాల్గొన్నది.