365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ముంబై, జనవరి 5, 2023: ఇటీవలే తన 85వ పుట్టినరోజు జరుపుకున్న ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా, రిటైర్మెంట్ తర్వాత కూడా తన సింప్లిసిటీతో అందరి దృష్టిని ఆకర్షించారు.
1991లో టాటా గ్రూప్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన రతన్ టాటా 2012 వరకు ఈ పదవిలో కొనసాగారు. ఆయన నాయకత్వంలో టాటా గ్రూప్ అనేక విజయాలను సాధించింది.
రతన్ టాటా విజయవంతమైన పారిశ్రామికవేత్తగానే కాకుండా ఆయనలో ప్రజలకు తెలియని మరో కోణం కూడా ఉంది. సౌమ్యుడిగా, మానవతావాదిగా కూడా మంచి గుర్తింపు పొందారు.
టాటా గ్రూప్ ఉద్యోగుల ఆలనా ,పాలనా చూసుకునేవారు. ఎంతగా అంటే కంపెనీ ఉద్యోగి ప్రాణాలను కాపాడేందుకు పైలట్ మారేంతగా.. విమానం నడిపేందుకు సిద్ధమై తన దాతృత్వాన్ని చాటుకున్నారు. రతన్ టాటా ఒక అనుభవజ్ఞుడైన వ్యాపారవేత్తనే కాదు. లైసెన్స్ పొందిన పైలట్ కూడా.
ఆగస్ట్ 2004లో పూణేలోని టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ ఎం. తెలంగ్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. అతన్ని వెంటనే ముంబైకి తరలించాలని వైద్యులు సూచించారు.
కానీ ఆరోజు ఆదివారం కావడంతో వైద్యులు ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేయలేకపోయారు. ఈ విషయాన్ని పూణేలో ఉన్న రతన్ టాటాకు తెలియజేయగా, ఆయన కంపెనీకి చెందిన విమానాన్ని నడిపారు.
తమ ఉద్యోగి ప్రాణాలు కాపాడడానికి ఎయిర్ అంబులెన్స్ లో అతన్ని ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. రతన్ టాటా దాతృత్వానికి సంబంధించిన కథను గ్రూపులోని అప్పటి ఉద్యోగులు చెప్పారు.
టాటా మోటార్స్ అప్పటి ఎండీ ప్రకాష్ ఎం తెలంగ్ టాటా గ్రూప్‌లో 50 సంవత్సరాలు పనిచేసి 2012 సంవత్సరంలో పదవీ విరమణ చేసారు. అదే సంవత్సరంలో రతన్ టాటా కూడా పదవీ విరమణ చేశారు.
రతన్ టాటాకు కూడా యుద్ధ విమానాన్ని నడిపిన అనుభవం ఉంది. రతన్ టాటా శిక్షణ పొందిన లైసెన్స్ పొందిన పైలట్. ఆయనకు డస్సాల్ట్ ఫాల్కన్ 2000 ప్రైవేట్ జెట్ కూడా ఉంది. దీని ధర దాదాపు రూ. 150 కోట్లు.
2011లో రతన్ టాటా బెంగళూరు ఎయిర్‌షోలో బోయింగ్‌కు చెందిన ఎఫ్-18 సూపర్ హార్నెట్ విమానంలో ప్రయాణించారు.
ఫిబ్రవరి 28, 2019న తన 82వ పుట్టినరోజు సందర్భంగా అందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. రతన్ టాటా 2007లో టాటా అమెరికన్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ F-16లో కూడా ప్రయాణించారు. అప్పటికి ఆయన వయసు 69 ఏళ్లు.