365తెలుగుడాట్ కామ్ న్యూస్, హైదరాబాద్, డిసెంబర్19, 2022: గ్లోబల్ దక్షిణాది నుంచి ఎంతోమంది సినీనటులు రాజకీయాల్లో ఉన్నారు. బాలీవుడ్ లో కూడా అనేమంది సినీ ప్రముఖులు రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఇప్పటికీ రాణిస్తూనే ఉన్నారు.
ఇటీవల ప్రముఖ సినీ నటుడు విశాల్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు కుప్పం నుంచి పోటీ చేయబోతున్నాడని గత కొంతకాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి.
ఈ పుకార్లపై ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న హీరో విశాల్ తాజాగా స్పష్టతనిచ్చాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన లాఠీ సినిమా విడుదలకు సిద్ధమైంది.
ఈ మూవీ ప్రమోషన్‌కు సంబంధించి చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశాల్ మాట్లాడుతూ.. రాజకీయ రంగ ప్రవేశంపై తేల్చి చెప్పాడు.
తనకు సామాజిక సేవ అంటే ఎంతో ఇష్టంఅని, తాను తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించాడు.
అయితే, కుప్పం నుంచి చంద్రబాబునాయుడుపై పోటీ చేస్తున్నట్టు వస్తున్న వార్తలు మాత్రం వదంతులేనని తేల్చి చెప్పాడు.
కుప్పం ప్రాంత ప్రజలతో తనకు మంచి అనుబంధం ఉన్న మాట వాస్తవమేనని, అక్కడ తన తండ్రి గ్రానైట్ వ్యాపారం చేసేవారని, మూడేళ్లపాటు తాను అక్కడే ఉన్నానని తెలిపాడు.
అలాగే, పెళ్లికి సంబంధించి వస్తున్న ఊహాగానాలపైనా విశాల్ స్పందించాడు. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన తనకు లేదని విశాల్ వెల్లడించాడు.