Sun. Dec 22nd, 2024
New satellite channel

మరో శాటిలైట్ న్యూస్ ఛానల్ వచ్చేస్తుందోచ్..!

భారీ పెట్టుబడితో సరికొత్త హంగులతో 24గంటల తెలుగు ఛానల్..

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, నవంబర్ 29,2021: తెలుగు రాష్ట్రాల్లోని జర్నలిస్టులకు గుడ్ న్యూస్…! కొద్దిరోజుల్లో మరో శాటిలైట్ ఛానల్ రానున్నది. ఇది ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు చెందినదిగా తెలుస్తోంది. ప్రస్తుత డిజిటల్ మీడియా కు ధీటుగా ఉండేలా ఆ టీవీ ఛానల్ ను తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఓ ప్రముఖ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఆ ఛానల్ కు సంబంధించిన ఏర్పాట్లు చక చకా జరిగిపోతున్నాయి. భారీ పెట్టుబడితో రానున్నఈ ఛానల్ నేటితరాన్ని దృష్టిలో ఉంచుకొని, సరికొత్త టెక్నాలజీతో అప్డేటెడ్ వెర్షన్ టీవీ ఛానల్ ను తెస్తు న్నారు. “పైనీర్” ఇంగ్లీష్ పేపర్ కు చెందిన యాజమాన్యం ఆధ్వర్యంలోనే ఈ శాటిలైట్ ఛానల్ వస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే కొత్త తరం జర్నలిస్టులను తయారుచేసేపనిలో పడ్డారు ఓ సీనియర్ జర్నలిస్ట్. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే జనవరిలో కొత్త ఛానల్ ఆన్ ఎయిర్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నగరం నడిబొడ్డున సరికొత్త హంగులతో 24గంటల తెలుగు ఛానల్ ను రూపొందించే పనిలో పడింది యాజమాన్యం. ఇప్పటికే కొన్నిప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు అక్కడ చేరేందుకు సంప్రదింపులు జరిగినట్లు సమాచారం. మొత్తానికి ఈ ఛానల్ రాకతో కొంతమందికైనా వారి జీవన ప్రమాణానికి తగిన జీతాలు ఇస్తారని ఆశిస్తూ..కొత్త టీవీ ఛానల్ కు ఆల్ ది బెస్ట్…

error: Content is protected !!