Sun. Dec 22nd, 2024
ramijirao_eenadu

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, అమరావతి, అక్టోబర్ 20, 2022: గుడివాడ హైస్కూలులో చదువుకున్న చెరుకూరి రాముకు (రామోజీ) కమ్యూనిస్ట్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ సభ్యత్వం బాగానే ఉపయోగపడింది. ‘బొమ్మలు గీసే’ ఈ పెదపారుపూడి కుర్రాడు విద్యార్థి ఫెడరేషన్‌ కార్యకర్తగా ‘రాజకీయ చైతన్యం’ తగినంత వంటబట్టించుకున్నాడు. ఎన్‌.టి. రామారావు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ 1983, 1985, 1994 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని ఆయన ఈ రాజకీయ స్పృహతోనే ఊహించగలిగాడు.

Source from twitter

ramijirao_eenadu

1977మార్చిలో ఎమర్జెన్సీ తొలగించాక జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో ప్రధాని ఇందిరాగాంధీ ఘోర పరాజయం పాలయ్యారు. దీంతో ‘తెలుగు మీడియా చాణక్యుడి’కి ధైర్యం వచ్చింది. అప్పటి నుంచీ ‘ఈనాడు’లో గట్టి కాంగ్రెస్‌ వ్యతిరేక ధోరణి కనిపించింది.

Source from twitter

కాని, తనకు అవసరం ఉన్నప్పుడు తన శ్రేయోభిలాషి అనుకున్న కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారి సహాయ సహకారాలు తీసుకున్నట్టుగానే 1989–94 మధ్య నేదురుమల్లి జనార్దనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి వంటి కాంగ్రెస్‌ సీఎంల సాయాన్ని రాము అడిగి మరీ పుష్కలంగా స్వీకరించారు. 2004 ఎన్నికల్లో చంద్రబాబు ఓటమిని ఊహించని రాము! అంటూ వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి తన ట్విట్టర్ లో పంచుకున్నారు.

error: Content is protected !!