365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5, 2025: బిజినెస్‌మ్యాన్ అనిల్ అంబానీకి, ఆయన కంపెనీలకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సహా పలు బ్యాంకులు ఇప్పటికే అనిల్ అంబానీని “మోసగాడు” (fraud)గా పేర్కొనగా, తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) కూడా ఆ జాబితాలో చేరింది.
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (Rcom)దాని అనుబంధ సంస్థలు ఈ బ్యాంకుల నుంచి ఏకంగా 31,580 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకున్నాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడా ఆరోపణల ప్రకారం, ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లలో జరిగిన మోసాన్ని గుర్తించారు. ఈ రుణాలు Rcom కంపెనీ “కార్పొరేట్ ఇన్‌సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్” (CIRP)లోకి ప్రవేశించడానికి ముందు తీసుకున్నవి.
ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనిల్ అంబానీకి, బ్యాంకుల నుంచి వచ్చిన ఈ “ఫ్రాడ్” ముద్ర మరింత చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది.