Mon. Dec 23rd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఎర్రుపాలెం, జూన్ 27,2023: ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెంమండల కేంద్రంలో సోమవారం యాంటీ డ్రగ్స్ డే ను పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్ నుంచి రింగ్ సెంటర్ వరకు డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎస్సై ఎం సురేష్ మాట్లాడుతూ.. “డ్రగ్స్ తో యువత బతుకులు చిద్రమవుతున్నాయని, డ్రగ్స్ ఆరోగ్యానికి హానికరమని అన్నారు. [ప్రతి ఒక్కరూ డ్రగ్స్ కు దూరంగా ఉండాలని” ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో ఎర్రుపాలెం సర్పంచ్ మొగిలి అప్పారావు, పలు పాఠశాలల హెచ్ఎంలు, పోలీస్ సిబ్బంది జ్యోతి, ప్రకాష్, సతీష్,శివరాం,రాములు ఉపేంద్ర కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!