Sun. Dec 22nd, 2024
Anumakonda-Bhargav_365

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఎర్రుపాలెం, ఏప్రిల్ 6, 2023: ఖమ్మం జిల్లా లోని ఎర్రుపాలెం మండల కేంద్రానికి చెందిన అనుమకొండ భార్గవ్ ను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సెక్రటరీగా నియమించినట్లు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వెల్లడించింది.

Anumakonda-Bhargav_365

పార్టీ కో-ఆర్డినేటర్ పిట్టం నవీన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేస్తూ.. ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా భార్గవ్ మాట్లాడుతూ “నాపై నమ్మకం ఉంచి పార్టీలో సముచిత స్థానం కల్పించిందుకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, టీపీసీసీ కార్యదర్శి చిలకా మధుసూదన్ రెడ్డి, నవీన్ లకు కృతజ్ఞతలు “అని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మరింత సేవ చేస్తానని ఆయన చెప్పారు.

error: Content is protected !!