Fri. Nov 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌, ఏప్రిల్‌ 11,2022 : భారతదేశపు మొట్టమొదటి 360 డిగ్రీ సాంకేతికాధారిత వ్యక్తిగతీకరించిన సీనియర్‌ కేర్‌ ప్లాట్‌ఫామ్‌ , వృద్థుల సంరక్షణ సేవలను అందించేట టువంటి సంస్థ అన్వయా, అత్యవసర పరిస్థితుల వేళ తగిన సహాయం అందించడం ద్వారా ప్రాణాలు కాపాడటంలో మరో అడుగు ముందుకేసింది. ఫుల్‌ స్టాక్‌ మెడికల్‌ అసిస్టెన్స్‌ స్టార్టప్‌ స్టాన్‌ ప్లస్‌ తో అన్వయా భాగస్వామ్యం చేసుకుని ఇప్పుడు యాప్‌ ఆధారిత అత్యవసర స్పందన వేదికను వృద్ధుల కోసం ప్రకటించింది. దీనిద్వారా వేగవంతమైన ఈటీఏ , రియల్‌ టైమ్‌ ట్రాకింగ్‌ మరియు వేగవంతమైన స్పందనను సాధ్యం చేస్తుంది.

అన్వయా,స్టాన్‌ప్లస్‌లు గత మూడేళ్లగా ఎన్నో ప్రాణాలు కాపాడాయి. ఈ భాగస్వామ్యంతో 350కు పైగా వైద్య అత్యవసర స్థితిలను నిర్వహించడంతో పాటుగా 97% ప్రాణాలను సమయానికి తగిన వైద్య సహాయం అందించడం ద్వారా కాపాడగలిగాయి. నూతన యాప్‌ ఆధారిత వేదికతో, ఈ భాగస్వామ్యం అంబుబెన్స్‌లు వచ్చేందుకు పట్టే
అంచనా సమయం గణనీయంగా తగ్గిస్తాయి. ఎందుకంటే, డ్రైవర్లకు ఇప్పుడు ప్రాంతం, స్ధితి, కాంటాక్ట్‌ వివరాలు,పెద్ద వయసు వ్యక్తులను విడిచి పెట్టాల్సిన ప్రాంతం సహా వాస్తవ సమయపు సమాచారం అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాట్‌ఫామ్‌ గురించి ప్రశాంత్‌ రెడ్డి, ఫౌండర్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌–అన్వయా మాట్లాడుతూ ‘‘అన్వయా వద్ద మేము సాంకేతికతను వినియోగించుకుని తమంతట తాముగా జీవిస్తోన్న వృద్ధులు,సీనియర్‌ సిటిజన్లకు మద్దతునందిస్తుంటాము.

సేవలకు ఖచ్చితత్త్వంతో అందించేందుకు సాంకేతికత మాకు తోడ్పడుతుంది. ఈ నూతన యాప్‌ వేదిక నమ్మకమైన, వేగవంతమైన,దయతో కూడిన అత్యవసర సహాయాన్ని హైదరాబాద్‌లోని పెద్ద వయసు వ్యక్తులకు అందించేందుకు తోడ్పడు తుంది. స్టాన్‌ప్లస్‌తో భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా ఎలాంటి అత్యవసర పరిస్థితు లలో అయినా పెద్ద వయసు వ్యక్తులకు అత్యవసర సమయాల్లో సహాయపడేందుకు తోడ్పడుతుంది.

error: Content is protected !!