Fri. Nov 8th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌, ఏప్రిల్‌ 12,2022: భారతదేశపు మొట్టమొదటి 360 డిగ్రీ సాంకేతికాధారిత వ్యక్తిగతీకరించిన సీనియర్‌ కేర్‌ ప్లాట్‌ఫామ్‌ , వృద్థుల సంరక్షణ సేవలను అందించేట టువంటి సంస్థ అన్వయా, అత్యవసర పరిస్థితుల వేళ తగిన సహాయం అందించడం ద్వారా ప్రాణాలు కాపాడటంలో మరో అడుగు ముందుకేసింది. ఫుల్‌ స్టాక్‌ మెడికల్‌ అసిస్టెన్స్‌ స్టార్టప్‌ స్టాన్‌ ప్లస్‌ తో అన్వయా భాగస్వామ్యం చేసుకుని ఇప్పుడు యాప్‌ ఆధారిత అత్యవసర స్పందన వేదికను వృద్ధుల కోసం ప్రకటించింది. దీనిద్వారా వేగవంతమైన ఈటీఏ , రియల్‌ టైమ్‌ ట్రాకింగ్‌, వేగవంతమైన స్పందనను సాధ్యం చేస్తుంది.

అన్వయా,స్టాన్‌ప్లస్‌లు గత మూడేళ్లగా ఎన్నో ప్రాణాలు కాపాడాయి. ఈ భాగస్వామ్యంతో 350కు పైగా వైద్య అత్యవసర స్థితిలను నిర్వహించడంతో పాటుగా 97% ప్రాణాలను సమయానికి తగిన వైద్య సహాయం అందించడం ద్వారా కాపాడగలిగాయి. నూతన యాప్‌ ఆధారిత వేదికతో, ఈ భాగస్వామ్యం అంబుబెన్స్‌లు వచ్చేందుకు పట్టే
అంచనా సమయం గణనీయంగా తగ్గిస్తాయి. ఎందుకంటే, డ్రైవర్లకు ఇప్పుడు ప్రాంతం, స్ధితి, కాంటాక్ట్‌ వివరాలు,పెద్ద వయసు వ్యక్తులను విడిచి పెట్టాల్సిన ప్రాంతం సహా వాస్తవ సమయపు సమాచారం అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాట్‌ఫామ్‌ గురించి శ్రీ ప్రశాంత్‌ రెడ్డి, ఫౌండర్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌–అన్వయా మాట్లాడుతూ ‘‘అన్వయా వద్ద మేము సాంకేతికతను వినియోగించుకుని తమంతట తాముగా జీవిస్తోన్న వృద్ధులు,సీనియర్‌ సిటిజన్లకు మద్దతునందిస్తుంటాము. సేవలకు ఖచ్చితత్త్వంతో అందించేందుకు సాంకేతికత మాకు తోడ్పడుతుంది.

ఈ నూతన యాప్‌ వేదిక నమ్మకమైన, వేగవంతమైన, దయతో కూడిన అత్యవసర సహాయాన్ని హైదరాబాద్‌లోని పెద్ద వయసు వ్యక్తులకు అందించేందుకు తోడ్పడు తుంది. స్టాన్‌ప్లస్‌తో భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా ఎలాంటి అత్యవసర పరిస్థితు లలో అయినా పెద్ద వయసు వ్యక్తులకు అత్యవసర సమయాల్లో సహాయపడేందుకు తోడ్పడుతుంది.ఈ నూతన సాంకేతిక వేదిక మా అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటుగా ప్రాణాలను కాపాడాలనే మా పరస్పర లక్ష్యం సాకారమవుతుం ది’’ అని అన్నారు.ఆయనే మాట్లాడుతూ ‘‘అన్వయా వద్ద మేము స్థిరంగా అత్యుత్తమ సేవలను పెద్ద వయసు వారికి అందించేందుకు ప్రయత్నిస్తుంటాము. ప్రస్తుతం మేము ఏడు నగరాలలో సేవలను అందిస్తున్నాము.

ఉత్తర,పశ్చిమ భారతదేశంలలో మరింతగా విస్తరించడానికి అవకాశాలను చూస్తున్నా ము’’ అని అన్నారు.ఈ భాగస్వామ్యం గురించి మరింతగా స్టాన్‌ప్లస్‌ ఫౌండర్‌ అండ్‌ సీఈవో ప్రభ్‌దీప్‌ సింగ్‌మాట్లాడుతూ ‘‘నేడు, స్టాన్‌ప్లస్‌ అనేది ఫుల్‌స్టాక్‌ మెడికల్‌ అసిస్టెన్స్‌ వేదిక. తమ ప్లాట్‌ఫామ్‌పై అత్యవసర స్ధితిలను నిర్వహించేందుకు
అవసరమైన సాంకేతికతను నిర్మించేందుకు ఇది తోడ్పడుతుంది. అన్వయా ఈ తరహాలో వృద్ధులకు సహాయమందిస్తుంది. ఈ వయసు వ్యక్తులకు వేగవంతమైన, స్ధిరమైన సంరక్షణ, స్పందనను అత్యవసర సమయాలలో అందిస్తుంది. సమాచారం వెల్లడించే దాని ప్రకారం, అత్యవసర వైద్య సేవలు అవసరమైన వ్యక్తులకు ఆలస్యమయ్యే ప్రతి క్షణం వారిలో జీవించే అవకాశాలు సన్నగిల్లుతుంటాయి. పెద్దవయసు వారిలో అది 7–10% వరకూ తగ్గుతుంది. మేము మా పూర్తి స్థాయి వైద్య సహాయాన్ని అందించేందుకు కట్టుబడి ఉన్నాము.

తద్వారా మేము ఈ భాగస్వామ్యంతో మరిన్ని ప్రాణాలను కాపాడగలము’’అని అన్నారు.అన్వయా తమ వినియోగదారులకు వాస్తవ సమయంలో వైద్య అత్యవసర అప్‌డేట్స్‌ను తమ యాప్స్‌పై అందించడంతో పాటుగా ప్రయాణ సమయంలో జీపీఎస్‌ కోఆర్డినేట్స్‌ను వీక్షించే అవకాశం అందిస్తుంది. అందువల్ల, టెక్‌ ఇంటిగ్రేషన్స్‌ వినియోగదారులకు అంబులెన్స్‌లను సాధ్యమైనంత దగ్గరగా ఉన్న ప్రదేశం నుంచి వృద్ధులకు కేటాయించడం వంటి మార్గాల్లో పూర్తి ప్రక్రియను వేగవంతంగా గుర్తించగలవు,ట్రాక్‌ చేయగలవు. అన్వయా,స్టాన్‌ప్లస్‌,నైపుణ్యవంతులైన ,సమర్థవంతులైన బృందం వృద్ధులు వేగవంతమైన స్పందనను అందుకోగలగడం తో పాటుగా అంబులెన్స్‌లను సమయానికి అందించగలమనే భరోసా అందిస్తుంది.
స్టాన్‌ప్లస్‌తో నమోదుచేసుకున్న తరువాత డ్రైవర్లకు పెద్దవారు ఉన్న ప్రాంతం, కండీషన్‌, కాంటాక్ట్‌ వివరాలు,డ్రాప్‌ లొకేషన్స్‌ గురించిన సమాచారం అందుబాటులో ఉండటం వల్ల వీలైనన్ని ప్రాణాలు కాపాడటం సాధ్యమవుతుంది.

స్టాన్‌ప్లస్‌ గురించి :స్టాన్‌ప్లస్‌ వద్ద మేము మీ సంరక్షణ కు తగిన చర్యలను తీసుకుం టుంటాము. అదే రీతిలో అవసరార్థుల కోసం అత్యుత్తమ వాతావరణం సృష్టిస్తుంటా ము. వైద్య రవాణా సేవలలో మా అంతర్జాతీయ అనుభవం, ఖచ్చితమైన, ఆధార పడతగిన, సౌకర్యవంతమైన సేవలను ప్రతి ఒక్కరికీ అందించేందుకు తోడ్పడుతుం ది. ప్రైవేట్‌ అంబులెన్స్‌ సేవలను అందించడంలో అగ్రగామిగా ఉండటంతో పాటుగా హైదరాబాద్‌ లో అంబులెన్స్‌ సేవల దగ్గరకు వచ్చేసరికి మేము అగ్రగాములుగా ఉన్నాము. ఈ విజయాలు మా అంకితభావం కారణంగానే సాధ్యమైంది. మా ఎమర్జెన్సీ
రెస్పాండర్స్‌ అత్యంత వేగంగా స్పందించడంతో పాటుగా వీలైనంత వేగవంతమైన పద్ధతిలో తగిన సహాయం అందించడానికి వీరు తోడ్పడుతున్నారు.

మొత్తంమ్మీద 900కు పైగా అంబులెన్స్‌లు 24 గంటలూ పనిచేయడంతో పాటుగా 15 నిమిషాలలోనే ఖచ్చితంగా వైద్య రవాణా అందిస్తుందనే భరోసా అందిస్తుంది. ఈ అంబులెన్స్‌లన్నీ కూడా అత్యున్నత స్దాయి యంత్ర సామాగ్రి కలిగి ఉండటంతో పాటుగా సుశిక్షతులైన వ్యక్తులను కలిగి ఉంటాయి.అవసరార్థులకు 24 గంటలూ వైద్య రవాణా సేవలను అందించేందుకు మేము కృషి చేస్తున్నాము.

అన్వయా గురించి :హైదరాబాద్‌ కేంద్రంగా కలిగిన టెక్నాలజీ స్టార్టప్‌ అన్వయా. ప్రశాంత్‌ రెడ్డి,అతని భార్య దీపికా రెడ్డిలు 2016వ సంవత్సరంలో దీనిని వ్యక్తిగతీక రించిన సాంకేతికాధారిత సీనియర్‌ కేర్‌ అందించాలనే లక్ష్యంతో ప్రారంభించారు.
భారతదేశపు మొట్టమొదటి సమగ్రమైన సాంకేతికాధారిత వ్యక్తిగతీకరించిన సీనియర్‌ కేర్‌ ప్లాట్‌ఫామ్‌గా ఏకీకృత వయోవృద్ధుల సేవలైనటువంటి ఆరోగ్య సంరక్షణ సహాయం,రోజువారీ సంరక్షణ సేవలు, లీజర్‌ కేర్‌, పేమెంట్‌ కేర్‌,ఎమర్జెన్సీ కేర్‌ , అదనపు సేవలు అయినటువంటి వీసా, పాస్‌పోర్ట్‌, టిక్కెటింగ్‌, లీగల్‌ సహాయంను సీనియర్‌ సిటిజన్లకు అందిస్తుంది. అన్వయా డాట్‌ కామ్‌, ఓ యాప్‌ ఆధారిత సేవ. దీనిని ప్రత్యేకంగా సీనియర్‌ సిటిజన్ల కోసం తీర్చిదిద్దారు.

ఇది తమ ప్రియమైన వారి సంక్షేమం కోసం తగిన మద్దతు పొందడంలో సహాయపడ టంతో పాటుగా అవసరమైన సేవలను అందించడం ద్వారా వారికి సహాయపడుతుం ది. పూర్తిగా అంకితం చేసిన మద్దతు సిబ్బందితో రోజంతా కూడా అన్వయా సహాయప డుతుంది. సీనియర్‌ సిటిజన్ల కోసం కస్టమైజ్డ్‌ కేర్‌ ప్లాన్స్‌ సబ్‌స్ర్కిప్షన్‌ ఆధారిత నమూ నాలో లభ్యమవుతున్నాయి. అక్టోబర్‌ 2016లో ఆవిష్కరించిన నాటి నుంచి అన్వయా ఇప్పటికి 6వేలకు పైగా కుటుంబాలకు తమ వయోవృద్ధుల సంరక్షణ మద్దతునందిం చింది. అన్వయా కిన్‌ కేర్‌ ఇటీవలనే తమసేవలను పూనెకు విస్తరించింది. వీరు ప్రస్తుతం హైదరాబాద్‌, ముంబై, చెన్నై, బెంగళూరు, కోయంబత్తూరు, విశాఖపట్నం లలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

error: Content is protected !!