365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌,మార్చి2,2022:భారతదేశపు మొట్టమొదటి ,ఒకే ఒక్క ఐఓటీ, ఏఐ టెక్‌ ఆధారిత వ్యక్తిగతీకరించిన పెద్ద వయసు వ్యక్తులు (ఎల్డర్లీ) సంరక్షణ కేంద్రం అన్వయా ఇప్పుడు తమ వ్యక్తిగతీకరించిన డెమిన్టియా (చిత్త వైకల్యం) కేర్‌ ప్లాన్‌ను విడుదల చేసింది. అభివృద్ధి చెందుతున్న న్యూరోడీజనరేటివ్‌ డిజార్డర్‌ డెమిన్టియాతో బాధ పడుతున్న పెద్దల అవసరాలను తీర్చే సంరక్షణ ప్రణాళిక ఇది.

డెమిన్టియాతో బాధపడుతున్న వ్యక్తులలో అభిజ్ఞా (జ్ఞాపక శక్తి, ఆలోచనా సామర్థ్యం, నిర్ణయాలను తీసుకునే శక్తి, తీర్పు మొదలైనవి) శక్తి క్రమంగా క్షీణిస్తుంది. చివరకు శారీరకంగా కూడా కూడా ప్రభావితమవుతుంది.డెమిన్టియా రోగుల కోసం వ్యక్తిగతీకరిం చిన సంరక్షణను అందించడానికి,వారు గౌరవింగా జీవించడానికి అన్వయా అనుకూ లీకరించిన మాడ్యుల్‌ను అభివృద్ధి చేసింది. కృత్రిమ మేథస్సు వినియోగించి తీర్చిదిద్దిన సృజనాత్మక సాంకేతిక వేదిక ఇది. ఈ కేర్‌ ప్లాట్‌ఫామ్‌ స్ధిరంగా సంరక్షణ
ఇచ్చే వారికి పీడబ్ల్యుడీ అర్థవంతంగా నిమగ్నమై ఉండేలా చూసుకునే సామర్థ్యాన్ని అందించడం ద్వారా నిరంతరం మార్గనిర్దేశం చేస్తుంది.

ఈ ప్లాట్‌ఫామ్‌ డెమెన్టియా ఉన్న స్ధితి ఆధారంగా తగిన కార్యకలాపాలను స్వయం చాలకంగా సూచిస్తుంది,వారి శారీరక, భావోద్వేగ,అభిజ్ఞా సంక్షేమం పెంచడానికి తగిన దిశలను సూచిస్తుంది. ఈ ప్రక్రియ సమర్థవంతమైన కేర్‌,ఊహించతగిన సేవలను డెమిన్టియాతో బాధపడుతున్న సీనియర్‌ సిటిజన్లకు అందిస్తుంది.దీనికి సుశిక్షితు లైన క్లీనీషియన్స్‌,కేర్‌ మేనేజర్లు తో కూడిన నెట్‌వర్క్‌ మద్దతునందిస్తుంది. సాధార ణంగా వయసుతో పాటుగా డెమిన్టియా స్ధితి వృద్ధి చెందుతుంది. అయితే, ఇది ఏజింగ్‌లో సాధారణంగా. 65సంవత్సరాలకు పైబడిన వయసు వ్యక్తులలో అధికంగా దాదాపు 90%గా డెమిన్టియా కేసులుకనబడుతుంటాయి,ఓ వ్యక్తి రోజువారీ కార్యకలాపా లలో సైతం ఆటంకం కలిగిస్తుంది.

వ్యక్తులను బట్టి వ్యక్తుల లక్షణాలలో సైతం ఇది విభిన్నంగా కనిపిస్తుంది. కాబట్టి రోగి స్ధితి పర్యవేక్షణ మరియు ట్రాకింగ్‌ కోసం సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిం చుకోవడంలో వ్యక్తిగతీకరించిన ప్రణాళిక అవసరం. వేగవంతంగా క్షీణించే పరిస్థితి కారణంగా మొత్తం కుటుంబానికి అసాధారణ ఒత్తిడి,బాధను కలిగించే డెమిన్టియాకు తగిన ప్రణాళిక లేదంటే తగిన రీతిలో ప్రొఫెషనల్‌ మద్దతు తప్పనిసరి. నిపుణులతో కూడిన సంరక్షణను వ్యక్తిగతీకరించడంతో పాటుగా ఇప్పటికే జరిగిన నష్టాన్ని అడ్డుకుని వారి ప్రయాణం వీలైనంత సాఫీగా జరిగేలా భరోసా అందిస్తూనే పరిస్ధితి మరింతగా దిగజారకుండా కాపాడటం చేస్తారు.

అన్వయా కిన్‌ కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఫౌండర్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘అన్వయా వ్యక్తిగతీకరించిన డెమిన్టియా కేర్‌ ప్లాన్‌ విడుదల చేయడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. పీడబ్ల్యుడీలకు సేవలనందించే కుటుంబంలోని వ్యక్తులపై భారం తగ్గించేలా సహాయపడేందుకు ఇది లక్ష్యంగా చేసుకుంది. అన్వయా డెమిన్టియా కేర్‌ ప్లాన్‌ వినూత్నమైన కార్యక్రమం. దీనిని పీడబ్ల్యుడీ (డెమిన్టియాతో బాధపడుతున్న రోగులు)కోసం ప్రత్యేకంగా నిపుణులు డిజైన్‌ చేశారు. జీవిత నాణ్యత మెరుగుపరచడంతో పాటుగా వ్యక్తిగతీకరించిన ప్యాకేజీలు
(వ్యక్తి కేంద్రీకృత సంరక్షణ)ను డెమిన్టియా రకం,అది ఉన్న దశ ఆధారంగా అందిస్తారు. డెమిన్టియా సైకాలజిస్ట్‌లు,న్యూరాలజిస్ట్‌లు, సైక్రియాటిస్ట్‌లతో మాకు ప్రత్యేక బంధం ఉంది.

వారు సమయానికి, తగిన జోక్యం చేసుకుంటూ ఉంటుంటారు. మేము ప్రత్యేకంగా శిక్షణ పొందిన కేర్‌ మేనేజర్లు,కేర్‌ గివర్లను నియమించుకున్నాము. వారు డెమిన్టియా పురోగతి ఆధారంగా సంరక్షణ కార్యక్రమాన్ని పునరావిష్కరించడంతో పాటుగా క్రమబద్ధమైన రీతిలో క్రమానుగతంగా కుటుంబ సభ్యులతో తిరిగి కనెక్ట్‌ అవుతారు. మేము సామాజిక, అభిజ్ఞా, శారీరక, వ్యక్తిగత అనుసంధానితను అందిస్తుంటాము. వ్యాధితీవ్రతను అడ్డుకోవడంతో పాటుగా రోగి స్ధితిని మెరుగుపరిచే రీతిలో నిపుణులు ఈ కార్యక్రమం తీర్చిదిద్దారు. అన్వయా డెమిన్టియా కేర్‌ ప్లాన్‌లో ప్రత్యేకంగా ఓ డైట్‌ ప్లాన్‌ను సైతం జోడించారు. ఇది అభిజ్ఞా ప్రక్రియ, ఆరోగ్యం మెరుగుపరుస్తుంది. వీటితో పాటుగా అన్వయా సమగ్రమైన సాంకేతిక వేదిక దృశ్యమాన్యత, ఊహాజనితత, విశ్వసనీయతతో కూడిన రక్షణను రోగులకు అందిస్తుంది.

డెమిన్టియాతో బాధపడుతున్న పెద్దలకు అత్యుత్తమంగా సేవలనందించేందుకు ,వారి కుటుంబ సభ్యులకు అత్యుత్తమంగా రోగిని నిర్వహించేందుకు సహాయపడనుం ది’’ అని అన్నారు.అన్వయా గురించిహైదరాబాద్‌ కేంద్రంగా కలిగిన టెక్నాలజీ స్టార్టప్‌ అన్వయా. ప్రశాంత్‌ రెడ్డి,అతని భార్య దీపికా రెడ్డిలు 2016వ సంవత్సరంలో దీనిని వ్యక్తిగతీకరించిన సాంకేతికాధారిత సీనియర్‌ కేర్‌ అందించాలనే లక్ష్యంతో ప్రారంభించారు.భారతదేశపు మొట్టమొదటి సమగ్రమైన సాంకేతికాధారిత వ్యక్తిగతీకరించిన సీనియర్‌ కేర్‌ ప్లాట్‌ఫామ్‌గా ఏకీకృత వయోవృద్ధుల సేవలైనటు వంటి ఆరోగ్య సంరక్షణ సహాయం, రోజువారీ సంరక్షణ సేవలు, లీజర్‌ కేర్‌, పేమెంట్‌ కేర్‌,ఎమర్జెన్సీ కేర్‌,అదనపు సేవలు అయినటువంటి వీసా, పాస్‌పోర్ట్‌, టిక్కెటింగ్‌, లీగల్‌ సహాయంను సీనియర్‌ సిటిజన్లకు అందిస్తుంది.

అన్వయా డాట్‌ కామ్‌, ఓ యాప్‌ ఆధారిత సేవ. దీనిని ప్రత్యేకంగా సీనియర్‌ సిటిజన్ల కోసం తీర్చిదిద్దారు. ఇది తమ ప్రియమైన వారి సంక్షేమం కోసం తగిన మద్దతు పొందడంలో సహాయపడటంతో పాటుగా అవసరమైన సేవలను అందించడం ద్వారా వారికి సహాయపడుతుంది. పూర్తిగా అంకితం చేసిన మద్దతు సిబ్బందితో
రోజంతా కూడా అన్వయా సహాయపడుతుంది. సీనియర్‌ సిటిజన్ల కోసం కస్టమైజ్డ్‌ కేర్‌ ప్లాన్స్‌ సబ్‌స్ర్కిప్షన్‌ ఆధారిత నమూనాలో లభ్యమవుతున్నాయి. అక్టోబర్‌ 2016లో ఆవిష్కరించిన నాటి నుంచి అన్వయా ఇప్పటికి 6వేలకు పైగా కుటుంబాలకు తమ వయోవృద్ధుల సంరక్షణ మద్దతునందించింది.