365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్,హైదరాబాద్, సెప్టెంబర్ 30,2025: రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన ‘శశివదనే’ మూవీ ట్రైలర్ సోమవారం విడుదల అయ్యింది. అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్‌తోనే ప్రేక్షకుల్లో భారీ క్విరియాసిటీ రేపుతోంది.
సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో, అహితేజ బెల్లంకొండ ,అభిలాష్ రెడ్డి గోదాల నిర్మించిన ఈ చిత్రం ఏజీ ఫిల్మ్ కంపెనీ ,ఎస్.వి.ఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందింది. సమర్పణ గౌరీ నాయుడు.
ట్రైలర్‌లో ప్రేమ కథ గోదావరి అందమైన నేపథ్యంతో సాగుతుందని స్పష్టమైంది. ఒక అమ్మాయిని చూసిన వెంటనే అబ్బాయి ప్రేమలో పడటం, ప్రేమ మొదలై కాలం బొమ్మలా ఆగిపోయినట్టు చూపించటం ప్రేక్షకుల హృదయాలను తాకుతోంది.
“లంకలోని సీత కోసం రాముడు సముద్రాలు దాటినట్లు.. నీ సైకిల్ పాప కోసం నువ్వు గోదారి దాటుతున్నావు” డైలాగ్ ద్వారా హీరో ప్రేమకు ఎదురైన సవాళ్లను చూపించడమే కాకుండా, ప్రేక్షకుల్లో ఊహాకరమైన ఆకర్షణను సృష్టిస్తోంది.

హీరో–హీరోయిన్ మధ్య ఉన్న ప్రేమ భావాలు, వారి ఎమోషనల్ సన్నివేశాలు ట్రైలర్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. “ప్రేమించాలని డిసైడ్ అయితే ఎన్నొచ్చిన యుద్ధం చేయాల్సిందే” అనే తండ్రి డైలాగ్ ద్వారా కథలో వచ్చే సమస్యలను ప్రేక్షకులకు ముందే చూపించారు. అలాగే, విలన్ పాత్ర ఎలా ప్రభావం చూపబోతోందో కూడా ట్రైలర్‌లో హింట్ ఇచ్చారు.
సాంకేతిక పరిజ్ఞానం:
సంగీతం: శరవణ వాసుదేవన్
నేపథ్య సంగీతం: అనుదీప్ దేవ్
కెమెరా: శ్రీ సాయి కుమార్ దారా
ఎడిటింగ్: గ్యారీ బీహెచ్
కాస్ట్యూమ్ డిజైన్: గౌరీ నాయుడు
పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్, ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)
మార్కెటింగ్: విష్ణు తేజ పుట్టా (క్రాస్ క్లిక్ మార్కెటింగ్)
నటీనటులు:
రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్, శ్రీమాన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ

ట్రైలర్ రిలీజ్ అయినప్పటినుంచి గోదావరి నేపథ్యంతో తెరకెక్కిన ప్రేమకథ, హీరో–హీరోయిన్ ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ, గాఢమైన ప్రేమ కథను చూపించబోతోంది.
ట్రైలర్ చూడటానికి: