365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆంధ్రప్రదేశ్ ,సెప్టెంబర్ 16,2022: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. రెండో రోజైన శుక్రవారం పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులు, ఆర్థికాభివృద్ధి అనే అంశంపై లఘు చర్చ జరిగింది. దీనిపై శాసనమండలిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాట్లాడారు. రెండో రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలపై చర్చకు పట్టుబట్టిన టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకరోజు సస్పెండ్ చేశారు.

శాసనసభలో ప్రవేశపెట్టిన ఎనిమిది కీలక బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. సివిల్ సర్వీసెస్ రద్దు బిల్లు, వ్యవసాయం, మార్కెటింగ్, ల్యాండ్ టైటిల్, యూనివర్సిటీల చట్టం సవరణ, పంచాయతీరాజ్ సవరణ తదితరాలను సభ ఆమోదించింది.