Mon. Dec 16th, 2024
AP CM INVITED FOR ANNUAL FETE
 365TELUGU | TTD

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల 27 సెప్టెంబరు 2021:అక్టోబరు 7 నుంచి 15 వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆహ్వానించారు.

తాడేపల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సోమవారం వారు ముఖ్యమంత్రిని కలిశారు.శ్రీవారి తీర్థప్రసాదాలు, బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రికి అందజేశారు. దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణి మోహన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 365TELUGU.COM | TTD

error: Content is protected !!