Fri. Nov 22nd, 2024
AP-DGP

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, విశాఖపట్నం,నవంబర్ 15,2022: విశాఖపట్నం నగర పోలీసు అధికారులతో ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. విశాఖపట్నంలో ఇటీవల రెండురోజుల పాటు జరిగిన ప్రధానమంత్రి పర్యటనలో ఎక్కడ ఎటువంటి అవాంతరాలకు తావు లేకుండా విజయవంతంగా విధులు నిర్వహించిన పోలీస్ శాఖకు చెందిన ప్రతి ఒక్క సిబ్బందిని అభినందించిన డి‌జి‌పి రాజేంద్రనాథ్ రెడ్డి.

ఈ సందర్భంగా విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న నేరాలపై రివ్యూ చేశారు. కమిషనరేట్ పరిధిలో క్రైమ్ రేట్ చాలా స్థిరముగా ఉందని, అటెమ్ట్ టో మర్డర్స్, రేప్ లు తగ్గాయని, రోడ్డు ప్రమాదాలు, మర్దర్లు స్తంభతగా నిలకడగానే ఉంది. ప్రాపర్టీ ఆఫన్సెస్ నేరాల శాతం తగ్గించాల్సిన అవసరం ఉంది అందుకు రానున్న రెండు నెలలలో ప్రత్యేక ప్రణాళిక తో ముందుకు వెళ్తామన్నారు.

AP-DGP

మొన్న జరిగిన లోక్ అదాలత్ తో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అత్యంత శ్రమించి సుడిర్గకాలంగా చిన్నపాటి వివాదాలు, మనస్పార్ధాల కారణంగా వివాదాల్లో ఉన్న కేసులలో ఇరువర్గాలను పిలిపించి వారికి కేసు తీవ్రత, జర జరగబోయే పరిణామాలు, ఎదుర్కొంటున్న ఇబ్బందుల పైన ఇరు వర్గాలకు అర్థమయ్యే విధంగా కౌన్సిలింగ్ నిర్వహించి లోక్ అదాలత్ లో రాజీ పడేందుకు ఎంతగానో కృషి చేశారు. దాని ద్వారా 47 వేల ipc మరియు పెండింగ్ ట్రైల్ కేసులు డిస్పోజల్ జరిగినాయి.

ఎఫ్ఐఆర్ కేసులతోపాటు వేల సంఖ్యలో పెట్టి కేసులను సైతం లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులందరినీ అభినందిస్తున్నాను. పోలీసులు న్యాయవ్యవస్థతో సమన్వయ పరుచుకోవడం ద్వారా ఈ సాధ్యమైంది. రాబోయే రోజుల్లో సైతం నిర్వహించే లోక్ అదాలత్ లో ఇదే రకమైనటువంటి విధానాన్ని అవలంభిచడం ద్వారా మరిన్ని పెండింగ్ కేసులను పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాను.

AP-DGP

పూర్తి పోలీస్ వ్యవస్థ కన్వెన్షన్ ఆధారంగా నడిచే విధంగా విధానాన్ని మార్చాము. నూతన విధానాన్ని అమలు చేస్తున్నాము. అందులో భాగంగా ఎస్పీలకు సైతం అత్యంత ముఖ్యమైన నాలుగు నుండి ఐదు కేసులను వారి పర్యవేక్షణలో దర్యాప్తు జరిగే విధంగా చర్యలు తీసుకున్నాము దీని ద్వారా కేసులలో నేరస్తులకు శిక్షల శాతం గణనీయంగా పెరుగుతుంది.

విశాఖపట్నం నగర పరిధిలో సంవత్సర కాల వ్యవధిలోనే కేవలం ఒక్క POSCOకు సంభందించిన 10 కేసుల్లో నిందితులకు శిక్ష పడే విధంగా పోలీసులు కన్విక్షన్ పడేవిధంగా చర్యలు చేపట్టడం జరిగింది. ఈ రకమైనటువంటి ఫలితాలు తీసుకురావడంలో కృషిచేసిన దిశా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్లకు అధికారులకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ విధానం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పోలీసు వ్యవస్థలో సమూలమైన మార్పులకు శ్రీకారం చుడుతున్నాము.

గంజాయి నిర్మూలనకు చర్యలు..

ఈ సంవత్సరం గంజాయి కి సంబంధించి గట్టిగా కృషి చేయడం ద్వారా ఇప్పటివరకు 1599 కేసులు నమోదు చేసి 1,32,000 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసులలో దేశంలోని 12 రాష్ట్రాలకు చెందిన నిందితులను గుర్తించాము.ఆ రాష్ట్రాల సహకారంతో అరెస్టు త్వరలోనే అరెస్టు చేస్తాము. అంతే కాకుండా త్వరలోనే తిరుపతిలో బార్డర్ గంజాయి, ఎర్రచందనం పైన సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాము.

AP-DGP

ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో ఇంకా కొంతమేర మావోయిస్టుల యాక్టివిటీస్ కొనసాగుతున్నాయి. ప్రస్తుతంAOB సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నిరంతరం కుబింగ్ అనేది కొనసాగుతూనే ఉంటుంది వారిని ఏరకంగా అని చేయాలన్న దానిపైన ఒక ప్రణాళికతో ముందుకు సాగుతూ ఉంటుంది అది నిరంతర ప్రక్రియ.

సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక ఎస్ఓపీ(స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్), అవగాహన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ లలో సైబర్ క్రైమ్ ఫిర్యాదులపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. సైబర్ క్రైమ్ ఫిర్యాదు వచ్చినప్పుడు ఏరకంగా కేసు నమోదు చేయాలి.. దానిని దర్యాప్తు ఏరకంగా నిర్వహించాలన్న దానిపైన ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. వీరంతా కూడా అనంతపురం పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణ పూర్తి చేసుకున్నారు.

AP-DGP

ఒక ముందస్తు ప్రణాళికతో స్టాండర్డ్ ఆపరేషన్ సిస్టంతో మేము ముందుకు కొనసాగుతున్నాము. లోన్ యాప్, పలు సైబర్ క్రైమ్స్ ను వివిధ అవగాహన కార్యక్రమాల ద్వారా, పోస్టర్ల ద్వారా అవగాహన పెంపోందించాలని, రోడ్డు ప్రమాదాలు మరింత తగ్గేలా బ్లాక్ స్పాట్స్ గుర్తించి, ఆ ప్రాంతాల్లో సిబ్బందిని తగిన సమయాలలో సధ్వినియోగించాలని తెలిపారు డీజీపీ.

త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం 6500 మంది పోలీస్ సిబ్బంది నియామకానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది త్వరలోనే ఆ నియమాకాలు చేపడతామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విశాఖ రేంజ్ డిఐజి ఎస్.హరికృష్ణ,ఐపిఎస్., నగర డి.సి.పి సుమిత్ సునీల్ గరుడ్, ఐపిఎస్, నగర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

error: Content is protected !!