![TTD-EX-OFFICIO-MEMBER](http://365telugu.com/wp-content/uploads/2021/11/TTD-EX-OFFICIO-MEMBER.jpg)
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,తిరుమల,అక్టోబర్ 31,2021: రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ డా|| ఎం.హరి జవహర్‌లాల్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో టిటిడి ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు.
![TTD-EX-OFFICIO-MEMBER](http://365telugu.com/wp-content/uploads/2021/11/TTD-EX-OFFICIO-MEMBER1.jpg)
తిరుపతి జెఈవో శ్రీమతి సదా భార్గవి డా|| ఎం.హరి జవహర్‌లాల్‌తో ప్రమాణం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆ తరువాత ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని వారికి అందించారు