Tue. Dec 24th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి,ఫిబ్రవరి 2,2022: రాజధాని కేసులపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరపు వాదనలను ధర్మాసనం విన్నది. పిటిషన్లు విచారణ అర్హత కోల్పోయాయని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులను ప్రకటించేటప్పుడు, ఉపసంహరించుకునేప్పు డు తమతో సంప్రదింపులు జరపలేదని హైకోర్టుకు కేంద్రం తెలిపింది. ప్రభుత్వ వాదనలపై అభ్యంతరాలుంటే తెలపాలంటూ పిటిషనర్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

error: Content is protected !!