CJI_chandra-chud

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, గుంటూరు,డిసెంబర్ 30,2022: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఆంధ్రప్రదేశ్‌ జ్యుడీషియల్ అకాడమీని లాంఛనంగా ప్రారంభించారు.

మంగళగిరి మండలం ఖాజాలో శుక్రవారం రోజున ఏర్పాటు చేసిన ఈ కార్య‍క్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు.

CJI_chandra-chud

అనంతరం సీజేఐ మీడియాతో మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం వాడకం పెరిగిందని, సాంకేతికతను అందిపుచ్చుకునేలా డిజిటలైజేషన్‌ ప్రక్రియకు శ్రీకారం చుట్టామని అన్నారు.

అందుకోసం సాంకేతికతకు అనుగుణంగా మార్పులు చేసుకోవాలని, కేసుల సత్వర పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుందని సీజేఐ చంద్రచూడ్‌ పేర్కొన్నారు.