365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,సెప్టెంబర్ 30, 2022: తెలంగాణ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కొట్టిపారేశారు. తెలంగాణ నుంచి తాము నేర్చుకోవాల్సింది ఏమీ లేదన్నారు. కేసీఆర్‌పై హరీశ్‌రావుకు కోపం ఉంటే విమర్శించే అవకాశం ఉందని మంత్రి అన్నారు.
టీఆర్‌ఎస్, కేసీఆర్, హరీశ్‌రావులను చూసి నేర్చుకునే స్థితిలో వైఎస్‌ఆర్‌సీపీ లేదని, ఏపీ భవన్‌లో హరీశ్‌రావు ఓ అధికారిని తన్నిన ఘటనను గుర్తు చేస్తూ హరీశ్‌రావు టీఆర్‌ఎస్ కు చెందినవ్యక్తా ..? లేదా రామోజీరావుకి చెందిన వ్యక్తా అని అమర్ నాథ్ ప్రశ్నించారు.
కేసీఆర్, హరీశ్ రావుల మధ్య గొడవలు ఉంటే చూసుకోవాలని మంత్రి అమర్ నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ నాటిన మొక్క మహావృక్షం అయ్యిందని అన్నారు. విశాఖపట్నంలో రేపటి నుంచి ఇన్ఫోసిస్ సేవలు ప్రారంభం కానున్నాయని మంత్రి అమర్ నాథ్ తెలిపారు. జనవరి నుంచి ఇన్ఫోసిస్ పూర్తి స్థాయిలో సేవలు అమలులోకి వస్తాయని,తద్వారా మొదటి దశలో వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన చెప్పారు.
బీచ్ ఐటీ నినాదంతో విశాఖలో ఐటీ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, విశాఖకు ఐటీ పరిశ్రమ తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే అని మంత్రి అభిప్రాయపడ్డారు. దళపల్ల భూములపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.