365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మే 6,2023: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్య నారాయణ శనివారం టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. ఏపీ టెన్త్ ఫలితాల్లో బాలికలకే ఎక్కువ మార్కులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా టెన్త్ పరీక్షల్లో 72.26 శాతం ఉత్తీర్థత సాధించారు విద్యార్థులు.
–బాలురు 69.27 శాతం, బాలికలు 75.38శాతం ఉత్తీర్ణత
–టాప్‌లో పార్వతీపురం జిల్లా, చివరి స్థానంలో నంద్యాల జిల్లా
–గతేడాది కంటే ఈసారి 5శాతం ఉత్తీర్ణత పెరిగింది.
–ప్రభుత్వ పాఠశాలల్లో 3.47 శాతం ఉత్తీర్ణత పెరిగింది.
-రీ కౌంటింగ్, వెరిఫికేషన్‌కు ఈ నెల 13 వరకు అవకాశం
–జూన్ 2 నుంచి 10 వరకు టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు
–ఈ నెల 17లోపు టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఏడాది మార్చిలో జరిగిన టెన్త్ పరీక్షలకు 6.40 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో 6,05,052 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో బాలికలు 2,95,807 మంది.. బాలురు 3,09,245 మంది ఉన్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా 3,349 కేంద్రాల్లో ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. ఏప్రిల్ 19 నుంచి 26 వరకు స్పాట్ వ్యాల్యూయేషన్ పూర్తి చేశారు.