Fri. Nov 22nd, 2024
Ap_Tourism

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,అమరావతి, ఫిబ్రవరి 24,2023: ఆంధ్రప్రదేశ్ సర్కారు పర్యాటక ప్రాంతాలను మరింతగా అభివృద్ధి చేసేందుకుసిద్ధమైంది. అందులో భాగంగా దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

మార్చి 3,4 తేదీల్లో విశాఖపట్నంలో ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ 2023 జరగనున్నది. ఈ నేపథ్యంలో ఏపీ టూరిజం, హ్యండీక్రాఫ్ట్స్, టెంపుల్స్, బీచ్‌లు, సోల్స్‌ స్పేస్, ఏ టూ జెడ్‌ టేబుల్‌ గైడ్‌పై ప్రత్యేక పుస్తకాలను ప్రచురించిన ఏపీ ప్రభుత్వం.

ఇంగ్లీష్, జర్మన్, స్పానిష్, చైనీస్‌ బాషల్లో పుస్తకాలు, ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌లు, వివిధ దేశాల రాయబార కార్యాలయాలు, టూరిజం సెంటర్స్‌లో ఏపీ ప్రత్యేకతలు వివరిస్తూ పుస్తకాలు, ఏపీలో టూరిజం, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణంపై ఈ పుస్తకాలలో ప్రత్యేక కథనాలున్నాయి.

Ap_Tourism

బెస్ట్‌ టూరిజం పాలసీ అవార్డును కైవసం చేసుకున్న ఏపీ ప్రభుత్వ టూరిజం శాఖ, ఇతర రాష్ట్రాలు కూడా ఏపీ టూరిజం పాలసీని అధ్యయనం చేస్తున్నాయని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చిన ఆ శాఖ అధికారులు. అభినందించిన ముఖ్యమంత్రి, రానున్న రోజుల్లో టూరిజం డెస్టినేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్న సీఎం.

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నెంబర్‌ వన్‌ గా ఉన్న రాష్ట్రాన్ని అన్ని రంగాలలోనూ అభివృద్ది పథంలో నడిపిస్తూ, పెట్టుబడులకు స్వర్గధామంగా తీర్చిదిద్దేలా ముందుకు సాగాలన్న ముఖ్యమంత్రి.

ఈ కార్యక్రమంలో టూరిజం శాఖ స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ రజత్‌ భార్గవ, పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఆర్‌.కరికాల్‌ వలవెన్, సమాచార శాఖ కమిషనర్‌ తుమ్మ విజయ్‌కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు.

error: Content is protected !!