Tue. Dec 17th, 2024
Aparna Group Undertakes COVID Vaccination Drive for 4000 Employees & 6000 Frontline Labourers

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,03 మే  2021 ః బిల్డింగ్‌ మెటీరియల్స్‌ తయారీ,రియల్‌ ఎస్టేట్‌ పై దృష్టి సారించిన అపర్ణ గ్రూప్‌ నేడు తమ ఉద్యోగులు, తమ ఫ్రంట్‌ లైన్‌ కార్మికుల కోసం వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను ఆరంభించినట్లు వెల్లడించింది. తమ బ్రాండ్లు అయిన అపర్ణ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌, అపర్ణ కన్‌స్ట్రక్షన్స్‌ అండ్‌ ఎస్టేట్స్‌ ప్రైవేట్‌లిమిటెడ్‌ వ్యాప్తంగా ఈ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ జరుగనుంది.ఈ డ్రైవ్‌కు అపర్ణ గ్రూప్‌ స్పాన్సర్‌చేస్తుంది. దీనిద్వారా అపర్ణ గ్రూప్‌ కార్యకలాపాలు నిర్వహిస్తోన్న చోట్ల 4వేల మంది ఉద్యోగులు, 6వేల మంది ఫ్రంట్‌లైన్‌ కార్మికులకు వ్యాక్సిన్‌లను అందించనున్నారు.ఆసక్తి కలిగిన ఉద్యోగులు, కార్మికుల కోసం నిర్వహిస్తోన్న ఈ  స్వచ్ఛంద వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ద్వారా అపర్ణ గ్రూప్‌, కమ్యూనిటీ సంక్షేమం పట్ల తమ నమ్మకాన్ని పునరుద్ఘాటిస్తుంది. ఇప్పటివరకూ 360 మంది ఉద్యోగులు వ్యాక్సిన్‌ తీసుకున్నారు. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఆశిస్తున్నారు. దీనితో పాటుగా ఉద్యోగుల భద్రత కోసం కంపెనీ పలు చర్యలను తీసుకుంది.ఈ స్వచ్ఛంద వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను ఏప్రిల్‌ 02వ తేదీన 45 సంవత్సరాలకు పైబడిన వయసు కలిగిన వ్యక్తుల కోసం ప్రారంభించారు. అపర్ణ గ్రూప్‌ కార్పోరేట్‌ కార్యాలయాలు, తయారీ కేంద్రాలు, కన్‌స్ట్రక్షన్‌ సైట్లలో ఈ వ్యాక్సినేషన్‌ జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ  వ్యాక్సిన్‌లను అందించడానికి సిద్ధం కావడంతో ఈ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని తమ ఉద్యోగులు, కార్మికులందరికీ విస్తరించింది.

Aparna Group Undertakes COVID Vaccination Drive for 4000 Employees & 6000 Frontline Labourers
Aparna Group Undertakes COVID Vaccination Drive for 4000 Employees & 6000 Frontline Labourers

సమాజ సంక్షేమం, అభివృద్ధి ఫలాలు నిరుపేదలకు సైతం చేరువకావాలనే లక్ష్యంతో అపర్ణ గ్రూప్‌ ప్రయత్నిస్తుంటుంది. ఈ లక్ష్యంతోనే కంపెనీ పలు సమాజ హిత కార్యక్రమాలను అపర్ణ నోవెల్‌ సొసైటీ ఫర్‌ వెల్ఫేర్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఆన్సర్‌) ద్వారా చేపట్టింది. ఆన్సర్‌ ప్రధానంగా గృహ, నీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్య సేవలు, ఉపాధి, విద్య విభాగాలలో పనిచేస్తుంది.మహమ్మారి వచ్చిన కొత్తలోనే ప్రధానమంత్రిసహాయనిధితో పాటుగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధులకు విరాళాలను అందించిన కొద్ది సంస్థలలో ఒకటిగా అపర్ణ గ్రూప్‌ నిలిచింది. ఈ గ్రూప్‌, కోవిడ్‌ సంక్షేమ కార్యక్రమాల కోసం 5 కోట్ల రూపాయలను విరాళంగా అందించింది.

error: Content is protected !!