365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జూన్ 24,2023: ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్ భారతీయ చెల్లింపు రంగంలోకి అడుగుపెట్టబోతోంది. త్వరలో కంపెనీ క్రెడిట్ కార్డును ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం సంస్థ ఇప్పటికే పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసింది.
ఆపిల్ క్రెడిట్ కార్డ్‌ను ప్రారంభించేందుకు కంపెనీ బ్యాంకులు, రెగ్యులేటర్స్ తో కూడా మాట్లాడింది. ఏప్రిల్‌లో ఆపిల్ స్టోర్‌ల ప్రారంభోత్సవం కోసం టిమ్ కుక్ భారతదేశానికి వచ్చినప్పుడు, ఆయన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సిఎండి శశిధర్, ఆర్‌బిఐ అధికారులని కూడా కలిశాడు.
భారతదేశంలో క్రెడిట్ కార్డ్‌లను ప్రారంభించడం వెనుక కంపెనీ పెద్ద ప్రణాళికను కలిగి ఉంది. యాపిల్ భారతదేశంలో క్రెడిట్ కార్డ్‌ను లాంచ్ చేస్తే, దాని ద్వారా ఎలాంటి ప్రయోజనం పొందవచ్చు. అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
యాపిల్ స్టోర్లు ప్రారంభమైనప్పటి నుంచి యాపిల్ దృష్టి భారత్ పైనే పడింది. ఇటీవల ముంబై లో స్టోర్ ప్రారంభించిన తర్వాత, ఇక్కడ ఐఫోన్ విక్రయాలు కూడా చాలా వేగంగా పెరిగాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో, భారతదేశం నుంచి ఆపిల్,ఆదాయం 50శాతం పెరిగింది.
కంపెనీ ఈ ఏడాది 50,000 కోట్లు అంటే 6 బిలియన్ డాలర్ల వ్యాపారం చేసింది. ఇప్పుడు ప్రజలు తమ Apple కార్డ్‌తో Apple ఉత్పత్తులను కొనుగోలు చేస్తే, దాని మార్కెట్ మరింత పెరుగుతుంది.
ఆపిల్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు..
తరచుగా షాపింగ్ చేసే వారు Apple కార్డ్‌ని ఉపయోగించి 1శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఇది Apple Pay నుంచి చెల్లింపుపై 2శాతం వరకు పెరుగుతుంది. Apple స్టోర్‌లలో చెల్లించడానికి Apple కార్డ్‌ని ఉపయోగించే వారికి ,ఎంచుకున్న భాగస్వాములకు, 3శాతం వరకు క్యాష్‌బ్యాక్ ఉంటుంది.
Apple క్రెడిట్ కార్డ్ కు వార్షిక రుసుము ఉండదు. ఇది కాకుండా, ఆలస్య రుసుము ఛార్జీలు లేవు.యుఎస్‌లోని ఆపిల్ కార్డ్ హోల్డర్‌లు ఆపిల్ ఉత్పత్తులను వడ్డీ లేకుండా సులభమైన వాయిదాలలో కొనుగోలు చేయవచ్చు.