365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూన్ 25, 2022: లేటెస్ట్ 13-అంగుళాల MacBook Pro ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన Apple స్టోర్లలో కొనుగోలు లేదా అదే రోజు పికప్ కోసం అందు బాటులో ఉంది. జూన్ 17, 2022న ప్రీ-ఆర్డర్ చేసిన భారత దేశంలోని కస్టమర్‌లు జూన్ 24 నుంచి తమ ఫోన్ లను స్వీకరి స్తున్నారు. Apple కొత్త Apple M2 చిప్‌తో నడిచే కొత్త MacBook Proని WWDC 2022 (ఆపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్)లో జూన్ 2022లో ముందుగా ప్రకటించింది. ఈ చిప్‌సెట్ మునుపటి Apple M1 చిప్‌పై మెరుగైన పనితీరును అందించడానికి సిద్ధమైంది.
మ్యాక్‌బుక్ ప్రో -2022 ఫీచర్స్..
MacBook Pro (2022) పాత డిజైన్ లాంగ్వేజ్‌ని కలిగి ఉంది, డిస్‌ప్లేపై నాచ్‌తో రాదు. ఇది పూర్తి HD+ రిజల్యూషన్, 100 శాతం DCI-P3 కవరేజీతో 13-అంగుళాల LCD ప్యానెల్‌ను కలిగి ఉంది. డిస్‌ప్లే ఇప్పుడు 20 శాతం బ్రైటర్ గా ఉంది. ఇది 500 nits మాగ్జిమమ్ బ్రైట్ నెస్ తో రానుంది.కొత్త MacBook Pro Apple అభివృద్ధి చెసిన M2 ప్రాసెసర్‌తో నడవనుంది. Apple M2 అనేది ఫోర్ పర్ఫామెన్స్ క్రోర్స్, ఫోర్ హై ఎఫీసెన్సీ క్రోర్స్ తో కూడిన ఆక్టా-కోర్ CPU ఉంటుంది. ఇది 24GB యూనిఫైడ్ మెమొరీ వస్తుంది. Apple M1లో ఎయిట్ క్రోర్స్ కు GPU టెన్ క్రోర్స్అందిస్తు న్నారు. పాత M1తో పోల్చితే తాజా M2 చిప్ 18 శాతం ఎక్కువ శక్తివంతమైనదని Apple తెలిపింది.
ఎంటర్టైన్మెంట్ కోసం, ఇది స్పేషియల్ సరౌండ్ సౌండ్‌తో నాలుగు-స్పీకర్ స్టీరియో సెటప్‌తో వస్తుంది. స్పీకర్లు , మూడు అర్రే మైక్రోఫోన్‌లు కీబోర్డ్‌లో పొందుపరిచారు. Wi-Fi 6 కనెక్టివిటీ, థండర్‌బోల్ట్ పోర్ట్‌లు, టచ్ ID, టచ్ బార్, Apple ProRes, యాక్టివ్ కూలింగ్ సిస్టమ్, మ్యాజిక్ కీబోర్డ్ , అడ్వాన్స్డ్ వెబ్‌క్యామ్ అవుట్‌పుట్ కోసం అధునాతన కెమెరా ISP వంటి కొత్త మ్యాక్‌బుక్ ప్రోలోని కొన్ని ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి. ల్యాప్‌టాప్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఒక్క సారి ఛార్జ్ చేస్తే 20 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది.
మ్యాక్‌బుక్ ప్రో -2022 రేట్ ఎంతంటే.?
MacBook Pro-2022 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,29,900 నుంచి ప్రారంభమవుతుంది. 8GB RAM + 512GB కాన్ఫిగరేషన్ కలిగిన టాప్ వేరియంట్ ధర రూ.1,49,900 ఉంది. ఇది Apple వెబ్‌సైట్, Apple స్టోర్ యాప్ Apple-స్టోర్లలోApple MacBook Pro-2022 కొనుగోలు చేయవచ్చు.