
365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్, తిరుమల, జూన్ 7,2022 :applications are Invited for admissions in SV College of Music and Dance ఎస్వీ సంగీత, నృత్య కళాశాలలో అడ్మిషన్స్ కోసం అప్లికేషన్స్ ఆహ్వానిస్తున్నారు. సాయంత్రం 5.30 నుంచి 6.30 వరకు ఒక గంట పార్ట్‌టైమ్ కోర్సుల్లో గాత్రం, వీణ, వయొలిన్, వేణువు, మృదంగం, భరతనాట్యం, కూచిపూడి నృత్యం విభాగాల్లో ప్రవేశాలు తిరుపతి లోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాలలో సాయంత్రం పార్ట్‌టైమ్ సర్టిఫికేట్, డిప్లొమా, కళాప్రవేశిక కోర్సుల ప్రవేశానికి జూన్ 10వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రిన్సిపల్ ఎం.సుధాకర్ ఓ ప్రకటనలో తెలిపారు.

applications are Invited for admissions in SV College of Music and Dance ఈ కళాశాలలో హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ గుర్తింపుపొందిన 4 ఏళ్ల సర్టిఫికెట్ కోర్సు , 2 ఏళ్ల డిప్లొమా కోర్సు ఉన్నాయి. టిటిడి నిర్వహించే కళాప్రవేశిక (రెండేళ్ల ఫౌండేషన్ కోర్సు) అప్లికేషన్ రూ 50 చెల్లించి కార్యాలయంలో కార్యాలయ పని వేళల్లో పొందవచ్చునని చెప్పారు. పూర్తి చేసిన దరఖాస్తులను జూన్ 10 నుంచి అన్ని జిరాక్స్ కాపీలతో కలిపి జూన్ నెలాఖరు లోపు సమర్పించాలని ప్రిన్సిపల్ ఎం.సుధాకర్ తెలిపారు. మరిన్ని వివరాలకు 0877-2264597 / 7330811173 / 9391599995 ఫోన్ ద్వారా లేదా టిటిడి వెబ్‌సైట్ www.tirumala.org ను సంప్రదించగలరు.