365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 11,2024:నటి రకుల్ ప్రీత్ సింగ్ తొలిసారిగా తన సొంత డైన్-ఇన్ రెస్టారెంట్ “ఆరంభం-స్టార్ట్స్ విత్ మిల్లెట్”ను ప్రారంభిస్తోంది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఏప్రిల్ 16న ఇది ప్రారంభం కానుంది. భారతదేశంలోని ప్రముఖ ఫుడ్ అండ్ బెవరేజెస్ సంస్థ, క్లౌడ్ కిచెన్ ఆపరేటర్ క్యూర్ ఫుడ్స్ తో కలిసి ఈ రెస్టారెంటును రకుల్ ప్రీత్ ప్రారంభిస్తోంది.
Source from Instagram
“ఆరంభం-స్టార్ట్స్ విత్ మిల్లెట్” అనేది ఒక విభిన్నమైన డైన్-ఇన్ కాన్సెప్ట్. ఇందులో పూర్తిగా చిరుధాన్యాలతో కూడిన వంటకాలే ఉంటాయి, ప్రతి గింజలోనూ పోషక విలువలు ఉంటాయి. సహజంగా ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యమిచ్చే రకుల్ ప్రీత్ సింగ్, ఈ రెస్టారెంటుకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఉంటే మన ఆరోగ్యం ఎంత బాగుంటుందన్నది ఆమె చెబుతుంది. https://curefoods.in
ఈ భాగస్వామ్యం గురంచి రకుల్ ప్రీత్ సింగ్ ఎంతో ఉత్సాహంగా ఇలా చెప్పింది.. “నేను హైదరాబాద్‌లో నా తొలి రెస్టారెంటు ప్రారంభిస్తున్నందుకు ఎంతో ఉద్విగ్నంగా ఉంది. అందరికీ పోషకాలతో కూడిన ఆహారం అందించబోతున్నాం. ఆహారం అనేది కేవలం శరీరానికే కాదు.. ఆత్మకు కూడా శక్తిని అందిస్తుంది. ఆరంభంలో మేం ఒకసారి పోషకాలతో కూడిన ఒక మిల్లెట్ బౌల్‌ను అందిస్తాం.”
ఈ ఆవిష్కరణ సందర్భంగా క్యూర్‌ఫుడ్స్ వ్యవస్థాపకుడు అంకిత్ నాగోరి మాట్లాడుతూ, “ఆరంభం అనేది కేవలం ఒక రెస్టారెంటు మాత్రమే కాదు; ఆరోగ్యకరమైన జీవనశైలికి మేం ఎలా కట్టుబడి ఉన్నామో, ఆహార నిర్ణయాలపై ఎంత బాధ్యతగా ఉన్నామో అది చూపిస్తుంది. ఈ భాగస్వామ్యం పట్ల మేమెంతో ఆనందిస్తున్నాం. ఇతర మార్కెట్లలోకి కూడా త్వరలోనే విస్తరిస్తాం” అని చెప్పారు.
అరంభం – స్టార్ట్స్ విత్ మిల్లెట్ అనేది వంటకాలకు కాబోయే హాట్ స్పాట్. ఇక్కడ ఆహార ప్రియులు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలనే లక్ష్యంతో వారి ఆహార సాహసాలను ఆహ్లాదకరమైన, స్థిరమైన విందుగా మార్చుకోవచ్చు. https://curefoods.in
క్యూర్‌ఫుడ్స్..
Source from Instagram
క్యూర్‌ఫుడ్స్ భారతదేశంలో ఎఫ్ అండ్ బి బ్రాండ్ల ప్రముఖ సంస్థ. అంకిత్ నాగోరి 2020లో దీన్ని స్థాపించారు. ఈట్ ఫిట్, కేక్ జోన్, నోమాడ్ పిజ్జా, షరీఫ్ భాయ్ బిర్యానీ, ఫ్రోజెన్ బాటిల్ వంటి బ్రాండ్లు ఇందులో ఉన్నాయి. ఇది భారతదేశంలోని 25 నగరాల్లో 300 కి పైగా క్లౌడ్ కిచెన్లు, ఆఫ్‌లైన్ స్టోర్లను కలిగి ఉంది. ఇవి 10 కి పైగా వంటకాలను అందిస్తాయి. తాజా ఆహార రంగంలో అతిపెద్ద తయారీ సామర్ధ్యంతో క్యూర్‌ఫుడ్స్ భారతదేశంలో రెండో అతిపెద్ద క్లౌడ్ కిచెన్ ప్లేయర్. క్యూర్‌ఫుడ్స్ గురించి మరింత సమాచారం కోసం https://curefoods.in చూడండి.
Also Read.. Rakul Preet Singh Launching Arambam In Collaboration With Curefoods
ఇది కూడా చదవండి: కోర్టులో విజయం సాధించిన క్యూ నెట్ ఇండియా..