365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నవంబర్ 28,2023:చలికాలం సీజన్ లో చలి ఎక్కువగా అనిపిస్తుంది. దీంతో దాహం తక్కువగా వేస్తుంది. ఈ కారణంగా శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది.
ఈ ప్రభావం చర్మంపై తీవ్రంగా పడుతుందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. ఈ చలికాలంలో చర్మ సంరక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
చలికాలంలో రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అటువంటి వాటిలో చర్మసంబంధిత సమస్యలు కూడా ఉన్నాయి. చలికి చర్మం ముడతలు పడడమేకాకుండా డ్రై గా మారుతుంది.
చలికాలంలో చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. చాలా సార్లు మనం భయాందోళనలకు గురవుతాము. మన ముఖానికి రసాయన ఉత్పత్తులను పూయడం ప్రారంభిస్తారు కొందరు, ఇది ఏమాత్రం మంచిది కాదు.
చర్మం పొడిగా మారినప్పుడు, ఏదైనా మాయిశ్చరైజర్, స్కిన్ క్రీమ్‌ను అప్లై చేస్తారు. ఇది చర్మాన్ని మరింత దెబ్బతీస్తుంది.
అంతేకాదు మొటిమలను కలిగిస్తుంది. చలికాలంలో చర్మ సంరక్షణ ఎలా తీసుకోవాలో మెరిసే చర్మాన్ని కాపాడుకోవడానికి మనం ఏమి చేయాలో తెలుసుకోవడం ముఖ్యం.
చలికాలంలో హీటర్లు ,బ్లోయర్లు, ఎండలో ఉండటం, వేడి నీటి స్నానం చేయడం వంటి అన్ని సౌకర్యాలను ఆనందిస్తాము.
మరోపక్కపెరుగుతున్న కాలుష్యం కూడా చర్మానికి హాని కలిగిస్తుంది. పోషకాహారం లేకపోవడం వల్ల చర్మం దురదగా అనిపించడం, పొడిగా మారడం జరుగుతుంది. ఈ చలి నుంచి చర్మాన్ని సంరక్షించుకోవాలి. అదెలా అంటే..?
-నీరు ఎక్కువగా తాగాలి..
చలికాలంలో మనం నీరు తక్కువగా తాగుతుంటాము ఎందుకంటే చల్లగా అనిపిస్తుంది కాబట్టి. అయితే, అనేక విధాలుగా మన శరీరం నుంచి నీరు బయటకు వెళ్ళిపోతుంది.
అప్పుడు స్కిన్ డ్రై గా మారుతుంది. అందువల్ల, చలిగా ఉన్నప్పుడు కూడా నీరు పుష్కలంగా తీసుకోవడం చాలా ముఖ్యం.
చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయండి..
శీతాకాలంలో మెరిసే చర్మాన్ని పొందడానికి మాయిశ్చరైజింగ్ అనేది చాలా ముఖ్యమైన దశలలో ఒకటి. ఇది మన చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది.
కొబ్బరి నూనె, ఆముదం, ఆలివ్ నూనె, మజ్జిగ, దోసకాయ మొదలైన వాటి నుంచి మీరు ఎంచుకోగల అనేక సహజ మాయిశ్చరైజర్లు ఉన్నాయి.
గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి..
చలికాలంలో గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల కండరాలకు ఉపశమనం లభిస్తుంది. ఇది మీ చర్మాన్ని పొడిబారేలా చేస్తుంది. మీ చర్మం సున్నితంగా ఉంటే..?
చల్లటి నీటితో స్నానం చేయలేరు, కానీ మనం ఖచ్చితంగా గోరువెచ్చని నీటితో కడగడం ద్వారా మన ముఖ చర్మాన్ని కాపాడుకోవచ్చు.
రాత్రి చర్మ సంరక్షణ దినచర్య..
ఆరోగ్యకరమైన చర్మాన్ని కావాలనుకుంటే, మీరు రాత్రిపూట దాదాపు 7-8 గంటల నిద్ర పోవడం చాలా ముఖ్యం. పడుకునే ముందు నూనెతో లోతుగా చర్మంపై మర్దన చేయండి, తద్వారా చర్మం మృదువుగా మారుతుంది.