365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నేషనల్, ఏప్రిల్ 14, 2022: విజయవం తమైనఒరిజినల్ సిరీస్‌ల ఒరవడిని కొనసాగిస్తున్న భారతదేశపు ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం వూట్ సెలక్ట్, వెన్నులో వణుకు పుట్టించే మరో అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్ – లండన్ ఫైల్స్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువ స్తోంది. అర్జున్ రాంపాల్, పురబ్ కోహ్లి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ కట్టిపడేసే ట్రైలర్‌ను వూట్ సెలక్ట్ విడుద ల చేసింది. డ్రామా, సస్పెన్స్‌తో మునివేళ్లపై నిలబెట్టే ఆరు-ఎపిసోడ్‌ల సిరీస్ వూట్ సెలెక్ట్‌లో మాత్రమే ఏప్రిల్ 21 నుంచి ప్రసారం కానుంది.
పరిశోధనాత్మక థ్రిల్లర్ సిరీస్ లండన్ ఫైల్స్‌లో నరమేధం డిటెక్టివ్ ఓం సింగ్ పాత్రను అర్జున్ రాంపాల్ పోషించాడు. లండన్ నగరంలో తప్పిపోయిన వ్యక్తి కేసును అతను చేపడతారు. వ్యక్తిగత సమస్యలతో ఓ వైపు పోరాడుతూనే తప్పిపోయిన మీడియా దిగ్గజం అమర్ రాయ్ కుమార్తె కేసును ఓం చేపట్టాల్సి వస్తుంది. క్రూరమైన ఇమ్మిగ్రేషన్ నిరోధక బిల్లుకు మద్దతు ఇచ్చిన వ్యక్తి అమర్ పాత్రలో పురబ్ కొహ్లీ నటించారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన ఓంకు ఒక చీకటి రహస్యం తెలుస్తుంది. పాతిపెట్టిన రహస్యాలతో పాటు ఓం అణిచిపెట్టిన గతాన్ని కూడా బహిర్గతం చేసేలా అది భయపెడుతుంది.
సీట్ అంచున నిలబెట్టే డ్రామా, సస్పెన్స్ నిండిన లండన్ ఫైల్స్‌లో గోపాల్ దత్, సప్నా పబ్బి, మేధా రాణా, సాగర్ ఆర్య, ఎవా జేన్ విల్లీస్ ఇత ప్రధాన పాత్రధారులు. సచిన్ పాఠక్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను నిర్మాత జార్ పిక్చర్స్. ఆరు ఎపిసోడ్‌ల ఈ సిరీస్ వూట్ సెలెక్ట్‌లో మాత్రమే ఏప్రిల్ 21న విడుదల కానుంది.
ఈ సిరీస్ గురించి ప్రధాన పాత్రధారి అర్జున్ రాంపాల్ మాట్లాడుతూ, “నేను గతంలో చేసిన చిత్రాలకు భిన్నమైనది లండన్ ఫైల్స్. నిజానికి దేశీయంగా లేదా అంతర్జాతీ య వేదికల్లో ఎక్కడా ఈ తరహా ప్రాజెక్టును చూడలేదని నేను నమ్ముతున్నాను. ఉన్నతమైన కేసును పరిశోధిస్తున్న ఓంకు (నా పాత్ర) మనం నిత్యం చూసే అనేక సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. డిటెక్టివ్ ఓం పాత్ర అనూహ్యమైనది, లోపభూయి ష్టమైనది, సంక్లిష్టమైనది కూడా. ఈ పాత్ర చిత్రీకరణ వ్యక్తిగతంగా నాపై ప్రభావం చూపిందని నేను ఒప్పుకోవాలి. దీని స్క్రీన్‌ప్లే, ఎడిట్, ఫొటోగ్రఫీ, నటన, కథనం
ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నేను కచ్చితంగా అనుకుంటున్నాను.
ఇది ప్రశ్నలను లేవనెత్తుతుంది, మార్గాన్ని చూపుతుంది. మొత్తం బృందం సాధించి న దాని గురించి నేను చాలా గర్వపడుతున్నాను. జార్ పిక్చర్స్ అండగా నిలవడం, దీన్ని వూట్ సెలక్ట్ ఎంచుకోవడం చాలా గొప్ప విషయం. ఇప్పుడు నేను అతి ముఖ్యంగా భావించే ప్రేక్షకుల ప్రతిస్పందన కోసం ఎదురుచూస్తున్నాను” అన్నారు.
పురబ్ కోహ్లీ మాట్లాడుతూ “రాక్ ఆన్ తర్వాత అర్జున్‌తో కలిసి సెట్‌కి తిరిగి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో అర్జున్ గొప్పగా నటించాడు. ఈ సిరీస్‌లో నా పాత్ర స్పెషల్ అపియరెన్స్‌గా ఉన్నప్పటికీ ఇలాంటి భిన్నమైన పాత్రలో నటించడం ఆసక్తికరంగా ఉంది. కష్టపడి సంపాదించుకున్న ప్రతీదాన్ని నాశనం చేయగల గతాన్ని కలిగి ఉన్న మీడియా దిగ్గజంగా నేను నటించాను, అందులో కూతురు తప్పిపోవడం మరో ముఖ్యమైన విషయం. చాలా గ్రే షేడ్స్‌తో కూడిన పాత్ర అమర్ రాయ్. మోహిత్, అజయ్‌తో కలిసి నేను రెండోసారి పనిచేస్తున్నాను. నిర్మాతలతో నా బంధాన్ని బలోపేతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది.
సచిన్ చాలా నిరాడంబరమైన దర్శకుడు, ఈ రంగంలో అతను ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడని నేను కచ్చితంగా అనుకుంటున్నాను. ఇండియాలో నా మొదటి వెబ్ సిరీస్ ‘ఇట్స్ నాట్ దట్ సింపుల్’ తర్వాత మళ్లీ వూట్‌లోకి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది” అన్నారు. ఈ థ్రిల్లర్ సిరీస్‌లో అతిధి పాత్రలో కనిపించే సప్నా పబ్బి మాట్లాడుతూ, “లండన్ ఫైల్స్ వంటి అద్భుతమైన షోలోభాగంగా నిలిచినందు కు నాకు చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. నటిగా, ప్రేక్షకురాలిగా థ్రిలర్స్ నాకు బాగా నచ్చిన జానర్.ఇలాంటి అద్భుతమైన స్టార్ కాస్ట్‌తో కలిసి పనిచేయడానికి ఇష్టపడకుండా ఎవరైనా ఉంటారా. లండన్ ఫైల్స్ ఒక హై-ఆక్టేన్ సస్పెన్స్ థ్రిల్లర్, ఊహించని మలుపులు, నిగూఢ పాత్రలతో ప్రేక్షకులను పూర్తిగా కట్టిపడేస్తుంది” అన్నారు.
“ఈ సిరీస్ రూపొందించడం నా కల. నా కలను సాకారం చేయడంలో సాయమందిం చిన అద్భుతమైన తారాగణం,సిబ్బందికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
ఇందులో భాగంగా నిలిచిన ప్రతీ కళాకారుడు నా అంచనాలకు మించి వారి పాత్రల్లో ఎంతో అద్భుతంగా ఒదిగిపోయారు. సామాజిక-రాజకీయ అశాంతి నేపథ్యంలో సాగే లండన్ ఫైల్స్ సంక్లిష్టమైన మానవ భావోద్వేగాలను ఒడిసిపడుతుంది. వూట్ సెలెక్ట్ లో ప్రదర్శనకు సిద్ధమవుతున్న ఈ సిరీస్‌ను రూపొందించేందుకు మేము ఎంత ఇష్టపడ్డామో అదే రీతిలో ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను” అని దర్శకుడు సచిన్
పాఠక్ అన్నారు. కట్టిపడేసే కథనం, ప్రతిభావంతులైన కళాకారులోత కిడన లండన్ ఫైల్స్ ఏప్రిల్ 21, 2022న విడుదల కానుంది. లండన్ ఫైల్స్ ట్రైలర్ ఇక్కడ చూడండి: https://we.tl/t-WLKm1BFtcj