365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మార్చి 30,2022 : అత్యంత గౌరవనీయమైన ఇంటిగ్రేటెడ్ కన్‌స్ట్రక్షన్,మౌలిక వసతుల అభివృద్ధి కంపెనీ ఏఆర్‌కె గ్రూప్ తమ మూడు దశాబ్దాలకు పైగా వారసత్వంతో అత్యంత విలాసవంతమైన, చిన్నారులకు అత్యంత ఇష్టమైన రీతిలో ఉండే సదుపాయాలతో ఏఆర్‌కె సంయక్‌ను హైదరాబాద్‌లోని బాచుపల్లి వద్ద ప్రారంభించినట్లు వెల్లడిం చింది. ఈ ప్రాజెక్ట్‌ను చిన్నారులతో పాటుగా మొత్తం కుటుంబానికి అనుసంధానితంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. ఇది సాటిలేని ఐశ్వర్యం అందిస్తుంది. ఈ కంపెనీ ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి డెలివరీ వరకూ కార్పోరేట్ రంగం, ప్రభుత్వ రంగ సంస్థలు ,హోమ్ స్పేసెస్‌తో కలిసి పనిచేయడంతో పాటుగా సేవా నాణ్యత,నిబద్థత పరంగా అత్యున్నత బెంచ్‌మార్క్‌ను నిర్ధేశిస్తుంది.
ఏఆర్‌కె సంయక్‌ను అత్యాధునికమైన,పటిష్టమైన మౌలిక సదుపాయాలతో చిన్నారులకు సరైన వాతావరణం సృష్టించడంపై దృష్టి సారించి అసాధారణంగా నిర్మించబడుతుంది. ఈ ప్రాజెక్ట్‌ను వ్యూహాత్మకంగా బాచుపల్లి వద్ద ఉంది. హైదరాబాద్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సబ్ అర్బన్ ప్రాంతమిది. పాఠశాలలు, మాల్స్, హాస్పిటల్స్,ఇతర నిత్యావసర సేవలకు అత్యంత అందుబాటు ధరలో ఉంది. ఏఆర్‌కె సంయక్ లాజికల్ గమ్యస్ధానంగా ఉంటుంది. దీని ప్రాథమిక అంశాలుగా చక్కదనం,లగ్జరీ ఉంటుంది. దీనిలో అపార్ట్‌మెంట్‌లను ఒకదానికొకటి
ఎదురెదురుగా లేనట్లుగా నిర్మించాము. ఈ సందర్భంగా జి రామ్ రెడ్డి, సీఎండీ, ఏఆర్‌కె గ్రూప్ మాట్లాడుతూ ‘‘ ఏఆర్‌కె సంయక్ ప్రధానంగా చిన్నారులు లక్ష్యిత గృహాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా చేసుకుంది.
వారి మానసిక అభివృద్ధి చెందేలా వీటిని డిజైన్ చేయడంతో పాటుగా భద్రత, ఆహ్లాదకరమైన అంశాలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాము. ఈ వాతావరణంలో వారు తమ పూర్తి శక్తి సామర్థ్యాలను ప్రదర్శించగలరు. ఏఆర్‌కె సంయక్, ఈ చిన్నారు లు తమ జీవితపు పరుగు పందెంలో ఉత్సాహపూరితమైన ఆరంభాన్ని అందించడా నికి ఓ మార్గంగా పనిచేస్తుంది. అత్యంత విలాసవంతంగా డిజైన్ చేసిన గృహాలు, కుటుంబాలకు సురక్షిత, భద్రతమైన వాతావరణం అందించడంతో పాటుగా చిన్నారుల మనసుల వికాసానికి తోడ్పడుతుంది. ఈ ప్రాజెక్ట్‌కు ఐజీబీసీ గోల్డ్ రేటింగ్ ఉంది. ప్రతి గృహంలోనూ అత్యాధునిక అంశాలను జోడించారు.ఈ ప్రాజెక్ట్‌లో పచ్చదనానికి అమిత ప్రాధాన్యతనిచ్చారు. స్ధానికంగా లభించే పలు రకాల మొక్కలు ఇక్కడ కనువిందు చేయనున్నాయి.
సౌరశక్తిని ప్రభావవంతంగా వినియోగించడంతో పాటుగా కామన్ ఏరియాలలో పొదుపు ను ఆచరించే ఇంధన పొదుపు కలిగిన లైటెనింగ్ ఫిక్సర్స్‌ను అమర్చారు. పర్యావరణ అనుకూలమైన సోసైటీగా తీర్చిదిద్దడంలో భాగంగా కమ్యూనిటీలో ఓ ఈవీ చార్జింగ్ సదుపాయం సైతం అమర్చాము’’ అని అన్నారు. మేఘన గుమ్మి, సీఈఓ, ఏఆర్‌కె గ్రూప్ మాట్లాడుతూ ‘‘ఏఆర్‌కె సంయక్ వద్ద మేము చిన్నారులు తెల్ల కాగితం లాంటి వారని భావిస్తున్నాము. ఆ పేపర్‌పై అందమైన కళాకృతులు సృష్టించడానికి అందించే క్రేయాన్స్‌లా అత్యంత అనువైన సదుపాయాలను అందించడం ద్వారా వారి జీవితాలను సైతం తీర్చిదిద్దాలని మేము కోరుకుంటున్నాము. అధిక స్ధాయిలో మెరుగుపెట్టడం వల్ల వారిలో ప్రతిభ కూడా ప్రకాశిస్తుందనే రీతిలో ఇక్కడ సౌకర్యాలు ఉంటాయి.
ప్రతి అపార్ట్‌మెంట్‌లోనూ అత్యాధునిక సాంకేతిక భద్రతా ప్రమాణాలు ఉంటాయి. ఇవి
ఎల్లప్పుడూ కుటుంబాన్ని కలిపి ఉంచేలా ఉంటాయి. ఈ అపార్ట్‌మెంట్‌లో అన్ని మూలలూ గుండ్రంగా ఉంటాయి. తద్వారా చిన్నారులు గాయపడరనే భరోసా అందిస్తుంది. చిన్నారుల బెడ్‌రూమ్, బాత్‌రూమ్‌లో మోషన్ సెన్సార్లను ఉంచడంతో పాటుగా వారి బెడ్‌రూమ్‌లో వినైల్ ఫ్లోర్ అందుబాటులో ఉంచాం. అలాగే చిన్నారుల కు తగిన భద్రతను కల్సిస్తూ సేఫ్టీ సాకెట్లను విభిన్నమైన ఎత్తులలో ఉంచాము.
రాజరికపు వైభోగంతో కూడిన లాంజ్ ఈ కమ్యూనిటీలో నివశించే ప్రజల వైభవం ప్రదర్శిస్తుంది. క్లబ్ హౌస్‌ను 4 ఫ్లోర్‌లలో నిర్మించారు. దీనిలో ఉత్సాహకరమైన కార్యక్రమాలు చేసే సదుపాయాలు ఉన్నాయి. ఇవి పిల్లలు, పెద్దల నడుమ సామాజిక సంభాషణలకు భరోసా అందించే రీతిలో ఉంటాయి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఆర్గానిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్, నీటి సామర్థ్యం కలిగిన ప్లంబింగ్ ఫిక్చర్స్ వంటివి ఇతర ప్రధానమైన మౌలిక వసతుల సదుపాయాలు. ఇవి ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి పర్యావరణ అనుకూలంగా మారుస్తారు’’అని అన్నారు.