365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మేడిపల్లి, మార్చి 2,2025:తెలంగాణను ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా మార్చేందుకు దోహదపడే విధంగా “రాచకొండ రన్నర్స్” ఆధ్వర్యంలో నిర్వహించిన “ఆరోగ్యరన్- 2025” ఈవెంట్ ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించిందని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఏవీ కన్స్ట్రక్షన్, ది ఆనంద ఇన్ఫినిటి జాయ్, విజయరత్న స్కూల్, సహస్రం డెవలపర్స్ సంస్థల సహకారంతో నారపల్లి భాగ్యనగర నందనవనం రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఆదివారం నిర్వహించారు.
మహాకుంభ్‌లో రైల్వే రద్దీ పెరగడంతో సమస్తిపూర్ డివిజన్‌కు రూ.1.85 కోట్ల ఆదాయం
ఇది కూడా చదవండి…యువతీ Vs యువకులు.. ప్రేమలో కొత్త ధోరణులు..
మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం 2K, 5K, 10K రన్ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన రన్నర్స్‌కు మెడల్స్ అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “రాచకొండ రన్నర్స్” సంస్థ ప్రతి సంవత్సరం ఇలాంటి ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయం అని తెలిపారు. మహిళలు, చిన్నారులు, యువత, వృద్ధులు అందరూ ఉత్సాహంగా పాల్గొనడం సంతోషకరమన్నారు.
ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ మాజీ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి, రాచకొండ రన్ నిర్వాహకులు ప్రభాకర్, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఎడవెళ్లి రఘువర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు నిర్మల, జవేద్ ఖాన్, నర్సింహా, శ్యామల నర్సింహా, కిరణ్ నాయక్, రమేష్, శంకర్ రావు, మామిడి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…ప్రస్తుత తరంలో లివింగ్ రిలేషన్‌షిప్ కు ప్రాధాన్యత ఎందుకు పెరుగుతుంది..?
ఇది కూడా చదవండి…90ల తరం అందాల తార రంభ రీ ఎంట్రీకి సిద్ధం..
అలాగే ఆరోగ్యరాన్ స్పాన్సర్లు సహా సుమారు 800 మంది ఈ కార్యక్రమానికి హాజరై ఆరోగ్యంపై తమ ప్రాముఖ్యతను చాటిచెప్పారు.