365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,హైదరాబాద్, 25జూన్, 2023: పలు వ్యాపార రంగాల్లో రాణిస్తున్న వ్యాపారవేత్తలను ప్రోత్సాహించేందుకు సెలెబ్‌స్పేస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీకారం చుట్టింది. అందులోభాగంగా హైదరాబాద్‌లోని దస్పల్లా హోటల్‌లో శనివారం ‘ఆరోహణ నేషనల్ బిజినెస్ అవార్డ్స్’ ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించింది.

ఈ అవార్డు ప్రదానోత్సవం ప్రధాన ఉద్దేశ్యం భారత ఆర్థిక వ్యవస్థకు ఉపాధి,ఆదాయ ఉత్పత్తికి నిరంతర క్రుషి చేస్తున్న వ్యాపారవేత్తలను గుర్తించి,వారి వ్యాపార నెట్‌వర్కింగ్‌ను పెంపొందించడం.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హజరైన ప్రముఖ నటుడు ఆలీ, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి 30మంది అవార్డు గ్రహీతలకు మొమెంటోలను అందించగా, నరేష్ లొల్ల, అమర్‌దీప్, తేజస్విని గౌడ్, శ్రీ రితిక తదితరులు ఈ వేడుకకు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సెలెబ్‌స్పేస్ క్రియేషన్స్ వ్యవస్థాపకుడు తరుణ్ తేజ మాట్లాడుతూ.. ప్రధానంగా వ్యాపార రంగంలో ఉన్న వ్యక్తుల కోసం ఆరోహణ నేషనల్ లెవల్ బిజినెస్ అవార్డ్ షోను నిర్వహిస్తు న్నామన్నారు.
ఆరోహణ నేషనల్ బిజినెస్ అవార్డ్స్ షో ప్రధాన లక్ష్యం కొత్తవారిని ప్రోత్సాహించడం, పాతవారికి గుర్తింపు ఇవ్వడం అని ఆయన అన్నారు. అనేక ఇతర వ్యక్తులతో కనెక్ట్ అవ్వడంలో వారికి సహాయపడటం, తమ కస్టమర్లకు సేవ చేయడానికి పడిన శ్రమకు తగిన గుర్తింపు ఇస్తున్నామన్నారు తరుణ్ తేజ వెల్లడించారు.
అవార్డు గ్రహీతలు:

సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కళాశాల
మాక్స్ ఫిట్‌నెస్
యూ వీ ప్లైవుడ్
సంప్రదాయ ఈవెంట్స్
పరంపర స్వీట్లు
సోనికా బ్రైడల్
నాగేందర్ బిల్డర్లు
ఎస్ ఇన్ఫ్రా – డా. స్రవంతి ఎల్లుసూరి
అర్రా ఫుడ్స్
ఆలివ్ సొల్యూషన్
అన్విత కలెక్షన్
విలేజ్ ట్రైల్స్ రిసార్ట్
కస్తూరి సిల్వర్ జ్యువెలర్స్
కావ్య జ్యువెలర్స్
బ్రౌన్ బ్రైడ్ ఫోటోగ్రఫీ
ఎలైట్ ప్రాపర్టీస్
పాలెట్ ప్లజర్
లస్సీ అండ్ షేక్స్
జి వాఫ్లరీ
జి క్రీమరీ
జి కేఫ్