365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూన్ 12,2023: ఐకానిక్ ప్రీమియం మెన్స్ వేర్ బ్రాండ్ అయిన ఆరో తాజాగా తన సమ్మర్ స్ప్రింగ్ కలెక్షన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త కలెక్షన్‌లో లేటెస్ట్ ట్రెండ్స్ తో పాటు..సరికొత్త లుక్ తో అన్ని సందర్భాలకూ సరిపోయేలా ఆరో సిద్ధం చేసింది.
ఆటోప్రెస్ షర్టులు, ఆటోఫ్లెక్స్ ప్యాంట్లు, ఐకానిక్ వైట్ షర్టులతో సహా ఫార్మల్ వేర్లు ఈ కొత్త కలెక్షన్‌లో ఉన్నాయి. ఆటోప్రెస్ షర్ట్ ముడతలు లేని వస్త్రానికి ప్రసిద్ధి చెందింది. ఇది పీచ్, లీలాక్, లేత గోధుమరంగు,క్రీమ్ షేడ్స్ కలిగిన మూడు రంగులలో లభిస్తుంది. ఆటోఫ్లెక్స్ ప్యాంటు సౌకర్యవంతమైన వెయిస్ట్ బ్యాండ్ ను కలిగి ఉంటుంది.
దీనివల్ల ప్రీమియంగా కనిపించడంతో పాటు సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తూ, అన్నిరకాల పనులు చేసుకోడానికి వీలుగా ఉంటుంది. ఐకానిక్ వైట్ షర్టులు వార్డ్ రోబ్‌కు అందాన్ని తీసుకొస్తాయి. వీటిని స్నేహితులు, కుటుంబ సభ్యులతో పెళ్లిళ్లు, సాధారణ విహారయాత్రల్లాంటి సందర్భాలలో ఉపయోగించవచ్చు.
ఈ కలెక్షన్‌లో సూట్లు, బ్లేజర్లు కూడా ఉన్నాయి. ఈ శ్రేణిలో పింక్, లేత ఆకుపచ్చ, లేత గోధుమ వంటి లేత రంగులలో సూట్లు ఉన్నాయి. ఇవి పగటి పెళ్లిళ్లకు సరైనవి. అలాగే మిడ్‌నైట్ నేవీ, వైన్, మెరూన్, బ్లూ-గ్రే, క్లాసిక్ ఈవెనింగ్ దుస్తులు అయిన బాటిల్ గ్రీన్ రంగులలో కూడా సూట్లు ఉన్నాయి.
వీటన్నింటికీ రివర్సబుల్ వెయిస్ట్ కోట్‌లు ఉంటాయి. ఒక వైపు అబ్‌స్ట్రాక్ట్ ఫ్లోరల్ జాకార్డ్, మరో వైపు ఒకే డిజైన్ మోడల్ ఉంటుంది. ఇది స్టైలిష్‌గా, వెర్సటైల్‌గా ఉంటుంది.

లినెన్ కలెక్షన్ అనేది రిలాక్స్‌డ్‌గా ఉండే క్యాజువల్స్ సమ్మర్ కలెక్షన్. ఇది మీకు సంతోషకరమైన వైబ్‌ను ఇస్తుంది. ఇందులో షర్టులు, ప్యాంట్లు, బ్లేజర్లు ఉంటాయి. షర్టులు ఫుల్-స్లీవ్, హాఫ్-స్లీవ్ రెండింటిలోనూ లభిస్తాయి. ప్యాంట్లలో బ్రోన్సన్ ఫిట్, ఎలాస్టికేటెడ్ వెయిస్ట్ బ్యాండ్, తేమను గ్రహించే లక్షణాలు ఉంటాయి.
ఆరో స్పోర్ట్ నుంచి పోలోస్, చినోస్ ఈ కలెక్షన్‌కు మరో వెర్సటైల్ సేకరణకు మరింత అదనపు ఆకర్షణగా ఉన్నాయి. ఈ పోలోలు మెర్సెరైజ్డ్ కాటన్‌తో తయారైన ప్రీమియం ఫ్యాబ్రిక్, వాటి యాంటీ-కర్లింగ్ కాలర్లకు ప్రసిద్ధి చెందాయి.
బ్రోన్సన్ స్లిమ్ ఫిట్ తో ఈ చినోస్ ను డిజైన్ చేశారు. స్టెయిన్ రెసిస్టెంట్ టెక్నాలజీ ఈ చినోలను ఎక్కువసేపు తాజాగా ఉంచుతుంది. ఈ లుక్ మామూలు రోజులకు అనువైనది. కుట్టిన బ్లేజర్‌తో కలిపి వేసుకుంటే ఇది ఎలివేటెడ్ లుక్ ఇస్తుంది.
ఆరో న్యూయార్క్ లైన్‌లో ఆధునిక వర్క్ వేర్, క్యాజువల్ దుస్తులు ఉన్నాయి. ఇంకా ఫ్యూచరిస్టిక్ పోలోలు, గ్రాఫిక్ ప్రింట్ తో కూడిన టీ-షర్టులు ఉన్నాయి. ఇది ప్రధానంగా మిలీనియల్ ఆడియన్స్‌కు సరైనది. టెన్నిస్ కోర్టుల నుంచి ప్రేరణ పొందిన కోర్ట్ క్లబ్ లైన్‌లో రిలాక్స్ డ్, సరదా, సోషలబుల్ ఫోటోలు, షర్టులు ఉన్నాయి.

కొత్త ఎస్ఎస్ 23 కలెక్షన్ విడుదల గురించి ఆరో సీఈఓ సుమన్ సాహా మాట్లాడుతూ, “ఆరో నుంచి ఎస్ఎస్ 23 లైన్ సొగసు, సౌకర్యాన్ని కలిపి ఇస్తుంది. అదే సమయంలో లేటెస్ట్ ట్రెండ్లకు అనుగుణంగా ఉంటుంది. ఆరో మీకు యుటిలిటీ, వెర్సాటిలిటీలతో కూడిన వివిధ రకాల వినూత్న దుస్తులను అందిస్తుంది.
ఇందులో షర్టులు, ప్యాంట్లు, టీషర్టులు, పోలోలు, చినోలు, బ్లేజర్లు, సూట్లు ఉన్నాయి. ఆరో నుంచి వచ్చిన ఈ లేటెస్ట్ కలెక్షన్ ఒక విస్తృతమైన ఎసార్ట్‌మెంట్. ఇది వెర్సాటిలిటీకి ప్రాధాన్యం ఇస్తూనే.. పురుషుల దుస్తుల కోసం అన్ని ముఖ్యమైన సందర్భాలను కవర్ చేస్తుంది” అని చెప్పారు.