365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఫిబ్రవరి 6, 2026:భారతదేశపు దిగ్గజ ఐస్‌క్రీమ్ బ్రాండ్ అరుణ్ ఐస్‌క్రీమ్స్ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. హైదరాబాద్‌లో నిర్వహించిన భారీ ఐస్‌క్రీమ్ సోషల్ పార్టీలో ఏకంగా 5,113 మంది చిన్నారులు ఒకే చోట చేరి ఐస్‌క్రీమ్‌ను ఆస్వాదించారు.

Read this also:Arun Icecreams Smashes Guinness World Record in Hyderabad with 5,000+ Children..

Read this also:Canon Unveils Groundbreaking Ultra-Wide RF Lenses for 2026..

ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్‌క్రీమ్ పార్టీగా ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో చోటు సంపాదించుకుంది. అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా పేరున్న అరుణ్ ఐస్‌క్రీమ్స్, వేలాది మంది పిల్లల సమక్షంలో ఈ అరుదైన మైలురాయిని అధిగమించి చరిత్ర సృష్టించింది.

ఇదీ చదవండి..ఏప్రిల్ 3న సంగీత్ శోభన్ ‘రాకాస’ ప్రపంచవ్యాప్త విడుదల.. నిహారిక కొణిదెల మరో ప్రయోగాత్మక చిత్రం!

Read this also:Sangeeth Shobhan’s Fantasy-Comedy ‘Raakaasaa’ Slated for April 2026 Global Release..

ఈ ప్రత్యేకమైన,ఆనందోత్సాహభరితమైన కార్యక్రమంలో భాగంగా, పిల్లలు రియల్ మిల్క్ , క్రీమ్‌తో తయారైన అరుణ్ ఐస్‌క్రీమ్స్ బ్లాక్‌కరెంట్ & స్ట్రాబెర్రీ బార్లు, కారామెల్ సాండ్‌విచ్, చాక్లెట్ కోన్స్‌ను ఆస్వాదించారు. పాల్గొన్న పిల్లలు నిరంతరం 30 నిమిషాల పాటు ఐస్‌క్రీమ్ తింటూ ఈ రికార్డును సాధించారు.

ఈ సందర్భంగా హాట్సన్ అగ్రో ప్రోడక్ట్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ ఆర్.జి. చంద్ర మోగన్ మాట్లాడుతూ, “5,000 మందికి పైగా పిల్లలు కలిసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సృష్టించడం నిజంగా మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే క్షణం. మా ప్రయాణం ఎప్పుడూ నాణ్యతపై ఉన్న నిబద్ధతతో పాటు, ఐస్‌క్రీమ్ అందించే సాదా ఆనందాన్ని ప్రతి ఒక్కరికీ పంచడమే లక్ష్యంగా సాగుతోంది” అని తెలిపారు.

ఇంతకు ముందు ఈ రికార్డ్‌ను 2019 జనవరి 30న ఇటలీలోని సలెర్నో నగరంలో యూనిలీవర్ ఇటలీ సంస్థ 962 మంది పాల్గొనగా నెలకొల్పింది. ఆ రికార్డును అధిగమించడం ద్వారా అరుణ్ ఐస్‌క్రీమ్స్ అంతర్జాతీయ స్థాయిలో కీలక మైలురాయిని సాధించింది.