365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నల్లగొండ, ఫిబ్రవరి 22,2024: పట్టణంలో జరిగిన ఆర్యజనని కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. దాదాపు 300లకు పైగా గర్భిణీలు హాజరయ్యారు.
మాతృత్వానికి అసలైన అర్థం చెప్పే కార్యక్రమం ఆర్యజనని అంటూ వక్తలు కొనియాడారు. వైద్యపరమైన సలహాలు, సూచనలతో పాటు గర్భిణిలకు ఆధ్యాత్మిక అంశాలను, సంస్కృతీ, సంప్రదాయాలను, పురాణేతిహాసాలను ఆర్యజనని టీమ్ సభ్యులు చక్కగా వివరించారు.
ఈ కార్యక్రమంలో రామకృష్ణ పరమహంస భక్తులు దశరథ్, ఆర్యజనని బృందానికి చెందిన నిహారిక, వృశాలి, మాధవి పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం గర్భిణిలకు పోషకాలతో కూడిన ఆహారాన్ని పంపిణీ చేశారు.
డాక్టర్ విఠల్ భోజన ఏర్పాట్లు చేయగా, కార్యక్రమ నిర్వహణను రామకృష్ణ పరమహంస భక్తులు దశరథ్ చూసుకున్నారు.