365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జనవరి 11,2026 : యోగాసన పోటీలు, తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్వర్యంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. 6 రాష్ట్రాల నుంచి 350 మంది బాలికలు, మహిళలు, ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ముఖ్య అతిథులుగా హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఒలింపిక్ స్టేట్ సెక్రటరీ మల్లారెడ్డి, యోగాసన భారత్ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీధర్ రావు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం డీపీఎస్ చైర్మన్, ఎమ్ ఎల్ సి మల్క కొమరయ్య నేతృత్వంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో 3 రోజులపాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతోంది.
దత్తాత్రేయ మాట్లాడుతూ యోగా శరీరానికే కాదు, మనసుకు కూడా ఎంతో మంచిదని అన్నారు. చిన్నతనం నుంచే పిల్లలకు అలవాటు చెయ్యాలని కోరారు.
శ్రీధర్ రావు మాట్లాడుతూ యోగాసన భారత్ ఆధ్వర్యంలో డీపీఎస్ స్కూల్ లో పోటీలు జరపడం ఆనందంగా ఉందని అన్నారు. యోగాను ప్రభుత్వం ఎంతో ముందుకు తీసుకువెళ్తోందని చెప్పారు. విజేతలకు నగదు బహుమతులు, సర్టిఫికేట్లు, పతకాలు ఇస్తామని తెలిపారు.

మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో మొదటిసారి ఈ పోటీలు నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పిల్లలకు యోగా లో మరింత ముందుకు వెళ్లేలా వారిని ప్రోత్సహించాలి, జోనల్ పరిధి లోనే కాకుండా రాష్ట్ర, జాతీయ పరిధిలో కూడా వెళ్లాలి అని తెలిపారు.
Read this also..IND vs NZ: Focus on New-Look Middle Order as India Face Kiwis Today..
ఇదీ చదవండి..పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సింధూరి చిత్రం..
డీపీఎస్ చైర్మన్ ఎమ్ ఎల్ సీ మల్క కొమరయ్య మాట్లాడుతూ యోగా ఎంతో ప్రాచీనమైనదని, దానిని ముందుకు తీసుకువెళ్ల వలసిన బాధ్యత మనదని, మోడీ పాలన లో యోగా ఎంతో ప్రభావాన్ని పొందినదని జూన్ 21తేదీన యోగా డే ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో యోగా కు సంబంధించిన విద్యార్థులు, కోచెస్, న్యాయనిర్ణేతలు పాల్గొన్నారు.
