ASUS announces ProArt StudioBook 16 OLED and Vivobook Pro OLED series  laptops in India

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,14 డిసెంబర్‌ 2021 ః తైవనీస్‌ టెక్నాలజీ సంస్ధ అసుస్‌ నేడు తమ వినియోగదారుల పీసీ శ్రేణిని, భారతదేశపు మొట్టమొదటి ప్రో ఆర్ట్‌ సిరీస్‌ ల్యాప్‌టాప్స్‌ను విడుదల చేసింది. కంటెంట్‌ క్రియేటర్లతో పాటుగా సృజనాత్మకత కలిగిన వినియోగదారుల కోసం తీర్చిదిద్దబడిన అసుస్‌ ప్రో ఆర్ట్‌ సిరీస్‌లో పరిశ్రమలో మొట్టమొదటి ఆవిష్కరణలను అసుస్‌  డయల్‌,టచ్‌ప్యాడ్‌ రూపంలో కలిగి ఉండటంతో పాటుగా స్టైలస్‌కు మద్దతునందిస్తుంది. ప్రతిష్టాత్మక ప్రో ఆర్ట్‌ స్టూడియో బుక్‌ 16 ఓఎల్‌ఈడీ తో పాటుగా అసుస్‌ ఇప్పుడు వివోబుక్స్‌ సిరీస్‌ను ఏఎండీ/ఇంటెల్‌ ,14అంగుళాలు/16 అంగుళాల వేరియంట్‌– వివోబుక్‌ ప్రో 14, వివో బుక్‌ ప్రో 15 ఓఎల్‌ఈడీ , వివోబుక్‌ ప్రో 14ఎక్స్‌ ఓఎల్‌ఈడీ, వివోబుక్‌ ప్రో 16ఎక్స్‌  ఓఎల్‌ఈడీ  రూపంలో  విడుదల చేయడంతో పాటుగా వ్యక్తిగతీకరించిన  ఎంపికలను వినియోగదారులకు అందిస్తుంది. ఈ ఉత్పత్తులు 75వేల రూపాయల ఆరంభ  ధరతో లభిస్తాయి. వీటిని ఆన్‌లైన్‌ (అసుస్‌ ఈ షాప్‌/అమెజాన్‌/ఫ్లిప్‌కార్ట్‌),ఆఫ్‌లైన్‌ (అసుస్‌ ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్స్‌/ఆర్‌ఓజీ స్టోర్‌/క్రోమా/విజయ్‌ సేల్స్‌/రిలయన్స్‌ డిజిటల్‌ ) మార్గాలలో డిసెంబర్‌ 14నుంచి లభ్యమవుతుంది. ప్రోఆర్ట్‌ స్టూడియో బుక్‌ శ్రేణి జనవరి నుంచి లభ్య కానుంది.

ప్రతి ప్రోఆర్ట్‌ ఉత్పత్తిలో  విప్లవాత్మక సాంకేతికతలు,వినూత్నమైన డిజైన్లను అసుస్‌ జోడించింది.  ఇది కేవలం అసాధారణ సౌకర్యం అందించడంతో పాటుగా శక్తివంతమైన పనితీరు,అసాధారణ వినియోగదారుల అనుభవాలనూ అందిస్తాయి. క్రియేటర్‌ సిరీస్‌ పీసీ లతో పాటుగా అసుస్‌ ఇప్పుడు అసుస్‌ ప్రో ఆర్ట్‌ ల్యాబ్‌ను విడుదల చేసింది. పరిశ్రమ వ్యాప్తంగా ఔత్సాహిక,పేరొందిన  క్రియేటర్లు ఒకే దరికి వచ్చి , తమ విజ్ఞానం పంచుకోవడానికి, నేర్చుకోవడానికి పూర్తిగా అంకితం చేయబడిన కార్యక్రమమిది. ఔత్సాహిక కళాకారులు, డిజైనర్లు, సంగీత కారులు, క్రియేటర్లు కోసం వినూత్నమైన కార్యక్రమంగా ఇది నిలువడంతో పాటుగా పరిశ్రమలో అత్యుత్తమతను ఔత్సాహిక క్రియేటర్ల  కోసం శిక్షణ అందించడం ద్వారా ప్రోత్సహించే  వినూత్నమైన వేదిక ఇది. అసుస్‌ ప్రో ఆర్ట్‌ ల్యాబ్‌ తమ మొదటి సెషన్‌ను 22 డిసెంబర్‌ 2021వ తేదీన  నిర్వహించనుంది. మరింత సమాచారం కోసం www.asus.com/in/ProArt/ProArt-Labs చూడవచ్చు.

Asus VivoBook K15 OLED priced at ₹ ₹46,990; laptop does a first for co”/>

శ్రీ లియాన్‌ యు, రీజనల్‌ డైరెక్టర్‌, సిస్టమ్‌ బిజినెస్‌ గ్రూప్‌, అసుస్‌ ఇండియా అండ్‌ సౌత్‌ ఆసియా మాట్లాడుతూ ‘‘అసుస్‌ వద్ద, మేము మా వినియోగదారులకు  సమగ్రమైన  వ్యవస్థను నిర్మించడాన్ని మేము గట్టిగా నమ్ముతున్నాం. వారికి కేవలం వినూత్నమైన మెషీన్లను అందించడం మాత్రమే కాదు సరైన గ్రూమింగ్‌నూ అందిస్తున్నాం.  ఔత్సాహిక కంటెంట్‌ క్రియేటర్ల కోసం మేము ప్రత్యేకంగా ఓ కార్యక్రమం రూపొందించడంతో పాటుగా పరిశ్రమ నుంచి అత్యుత్తమతను అభ్యసించే అవకాశం అందించాము. అసుస్‌ ప్రో ఆర్ట్‌ ల్యాబ్‌తో మేము క్రియేటర్‌ కమ్యూనిటీ నడుమ విజయాన్ని మా నూతన ప్రో ఆర్ట్‌ ల్యాబ్స్‌,ప్రొడక్ట్‌ శ్రేణి ద్వారా సృష్టించాము. మాకు అత్యంత కీలకమైన మార్కెట్‌ ఇండియా. భారతీయ సమాజంలో వృద్ధి చెందుతున్న అవసరాలను అందుకునే రీతిలో సృజనాత్మక డిజైన్‌లను పరిచయం చేస్తున్నాం’’ అని అన్నారు.

నూతన ప్రోఆర్ట్‌ ల్యాప్‌టాప్స్‌ను మన వర్క్‌ఫ్లోర్‌ నుంచి సృజనాత్మక హద్దులను తొలగించే రీతిలో నిర్మించారు.  ఇవి అసాధారణ పనితీరు, డిజైన్‌,వృద్ధి చెందుతున్న పర్యావరణ వ్యవస్ధను క్రియేటర్లకు అందిస్తుంది. మరీముఖ్యంగా ఎప్పుడూ ప్రయాణాలలో ఉండేవారితో పాటుగా తమ పూర్తిగా అంకితం చేయబడిన వర్క్‌స్పేస్‌లకు ప్రాధాన్యతనిచ్చే వారికి అనుకూలంగా ఉంటుంది. వివిధ రంగాల్లోని కంటెంట్‌ క్రియేటర్లను సంతృప్తి పరిచేందుకు, ఈ ప్రో ఆర్ట్‌ సిరీస్‌ విస్తృత శ్రేణి ఉత్పత్తులను వినూత్నమైన/పరిశ్రమలో మొట్టమొదటిసారి అనతగ్గ ఫీచర్లు అయినటువంటి అసుస్‌ డయల్‌ డిజైన్‌ మరియు టచ్‌ప్యాడ్‌తో అందిస్తుంది. ఇవి స్టైలస్‌కు మద్దతునందిస్తాయి. క్రియేటర్లు, డిజైనర్లు, వ్లోగర్స్‌, ఆర్టిస్ట్స్‌  వృద్ధి చెందుతున్న అవసరాలను అందుకునే రీతిలో డిజైన్‌ చేయబడిన ఈ నూతన స్టూడియో బుక్‌,వివో బుక్స్‌ , ల్యాప్‌టాప్స్‌పై ఓఎల్‌ఈడీ ప్యానెల్స్‌ను ప్రజాస్వామ్యీకరించేందుకు కట్టుబడి ఉన్నాయి. ఇవి అత్యున్నత శ్రేణి ప్రాసెసరులను ఇంటెల్‌,ఏఎండీ నుంచి కలిగి ఉండటంతో పాటుగా నివిడియా స్టూడియో,ఆర్‌టీఎక్స్‌ గ్రాఫిక్స్‌ను  అత్యుత్తమ సౌకర్యం,పనితీరు ను విస్తృత శ్రేణి సృజనాత్మక అప్లికేషన్స్‌ ద్వారా అందించేందుకు తీర్చిదిద్దారు. ఈ సిరీస్‌లోని ల్యాప్‌టాప్స్‌ కేవలం ఖచ్చితమైన కలర్‌ ఇమేజ్‌ను అందించడం మాత్రమే కాదు, శక్తివంతమైన, స్థిరమైన ప్రదర్శననూ అందిస్తుంది. వీటితో పాటుగా ఎక్స్‌క్లూజివ్‌ క్రియేటర్‌ హబ్‌ను ఇవి కలిగి ఉన్నాయి. ఈ ఉపకరణాన్ని ప్రొఫెషనల్స్‌ తమ సిస్టమ్‌ సెట్టింగ్స్‌ ఆప్టిమైజ్‌ చేసుకోవడానికి, కనెక్టడ్‌ మానిటర్స్‌ను కాలిబ్రేట్‌ చేసుకునేందుకు ,కీలకమైన యాప్స్‌ను వేగవంతంగా చేరుకునేందుకు తీర్చిదిద్దారు.

ఈ ఆవిష్కరణ గురించి ఆర్నాల్డ్‌ సు, బిజినెస్‌ హెడ్‌, కన్స్యూమర్‌ అండ్‌ గేమింగ్‌ పీసీ, సిస్టమ్‌ బిజినెస్‌ గ్రూప్‌, అసుస్‌ ఇండియా  మాట్లాడుతూ ‘‘ పరిశ్రమలో  నూతన ధోరణులు పుట్టుకురావడానికి ఇటీవలి కాలంలో ఎదురైన సంఘటనలు కీలకంగా నిలుస్తున్నాయి. ఇది క్రియేటర్లకు స్ఫూర్తి కలిగించడంతో పాటుగా ప్రత్యేకమైన యంత్ర సామాగ్రి కోసం వెదికేందుకూ తోడ్పడుతుంది. ఇవి వారి ప్రత్యేక అవసరాలకు తగినట్లుగా ఉండాలని కోరుకుంటున్నారు.ఎక్కడైతే నూతన సాంకేతికతను పరిచయం చేసే అవకాశం వస్తుందో అక్కడ మేము అత్యంత కీలకంగా వ్యవహరించాలని అసుస్‌ వద్ద మేము కోరుకుంటున్నాము. మా ప్రో ఆర్ట్‌ సిరీస్‌ను విడుదల చేయడమన్నది క్రియేటర్స్‌ కమ్యూనిటీకి ప్రత్యేకతను తీసుకురావాలనే దిశగా చేసిన ఓ చిరు ముందడుగు’’అని అన్నారు

<figure class=ASUS launches India's first ProArt series laptops dedicated to the Creators'  community

ఆయనే మాట్లాడుతూ ‘‘మొట్టమొదటి సారిగా వినూత్నమైన కార్యక్రమం అసుస్‌ ప్రో ఆర్ట్‌ ల్యాబ్‌ను వెల్లడిస్తుండటం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. క్రియేటర్‌ కమ్యూనిటీని మరింతగా శక్తివంతం చేయడాన్ని మేము లక్ష్యంగా చేసుకున్నాం.  ఇది అన్వేషించబడని సృజనాత్మకతను సైతం వెలికి తీసుకువస్తుంది. ఈ నూతన శ్రేణి ,ఫ్లాట్‌ఫామ్‌ అసాధారణ అనుభవాలను విభిన్నమైన జెనర్స్‌ వ్యాప్తంగా అందించడంతో పాటుగా క్రియేటర్స్‌ పరిశ్రమలో వృద్ధికి మార్గం వ వేసేందుకు సైతం అనుమతిస్తుంది’’ అని అన్నారు.

ప్రోఆర్ట్‌ అనేది ప్రో,ఆర్ట్‌ల సమ్మేళనం. దీనిని క్రియేటర్లు , క్రియేటర్ల కోసం సృష్టించారు.  ఇది సృజనాత్మకతను వృద్ధి చేయడంతో పాటుగా ప్రతి ఒక్కరికీ  అసాధారణతను సృష్టించేలా స్ఫూర్తినీ అందిస్తుంది. అసుస్‌ ఇప్పుడు అంతర్జాతీయంగా అత్యుత్తమ క్రియేటర్లతో కలిసి పనిచేయడంతో పాటుగా ప్రో ఆర్ట్‌ సిరీస్‌లో అత్యుత్తమ క్రియేటర్స్‌ నోట్‌బుక్స్‌ను సృష్టిస్తుంది. అదే సమయంలో ల్యాబ్‌, సరైన అభ్యాసాన్ని పరిశ్రమలో అత్యుత్తమైనదాన్ని అభ్యసిచేందుకు స్ఫూర్తి కలిగించడంతో పాటుగా పరిశ్రమలో భవిష్యత్‌నూ నిర్మిస్తుంది.