Thu. Dec 26th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నవంబర్ 23,2024:భారతదేశంలో ఈవీ టూ-వీలర్ పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న ఏథర్ ఎనర్జీ లిమిటెడ్ ఇప్పుడు రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ సహకారంతో తన ఏథర్ 450 సిరీస్, రిజ్టా స్కూటర్‌లకు ‘Eight70TM వారంటీ’ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

దీర్ఘకాలిక బ్యాటరీ ఆరోగ్యానికి సంబంధించి వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా 70% బ్యాటరీ స్టేట్-ఆఫ్-హెల్త్ హామీని, 8 ఏళ్లు లేదా 80,000 కి.మీల వరకు ఏది ముందయితే దానికి కవరేజీని Eight70TM వారంటీ అందిస్తుంది.

Eight70TM Warranty కీలక ప్రయోజనాలలో:

.గరిష్టంగా 8 ఏళ్లు లేదా 80,000 కి.మీ వరకు కవరేజీ, ఏది ముందుగా వస్తే దానికి వర్తిస్తుంది.

.70% బ్యాటరీ హెల్త్ ఎష్యూరెన్స్‌

·తయారీ లోపాలు, వైఫల్యాలపై పూర్తి కవరేజ్

·క్లెయిమ్ మొత్తాలపై గరిష్ట పరిమితి ఉండదు

·స్కూటర్‌ను ఛార్జ్ చేయకుండా వదిలేసినప్పుడు లేదా ఎక్కువ సమయం పాటు నిష్క్రియ స్థితిలో ఉన్నప్పుడు బ్యాటరీ సెల్‌ల డీప్ డిశ్చార్జ్ కారణంగా క్లెయిమ్‌ను తిరస్కరించరు

 ఏథర్ ఎనర్జీ సీఈఓ తరుణ్ మెహతా Eight70TM Warrantyపై X ( Twitter)లో ఇలా తెలిపారు.

ఈ సందర్భంగా ఏథర్ ఎనర్జీ లిమిటెడ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్‌నీత్ సింగ్ ఫోకెలా మాట్లాడుతూ, “ఈవీ కొనుగోలుదారులకు బ్యాటరీ మన్నిక కీలకమైన అంశం. వారి ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీల దీర్ఘ కాలిక మన్నిక, రీప్లేస్‌మెంట్ ఖర్చుల గురించి వినియోగదారుల భయాందోళనల గురించి మేము తరచుగా వింటూ ఉంటాము.

వారి ఉద్దేశాన్ని అర్థం చేసుకుని, 8 ఏళ్ల వరకు 70% బ్యాటరీ హెల్త్ ఎష్యూరెన్స్‌కు, మేము మా నూతన Eight70TM వారంటీని పరిచయం చేసాము. ఈ వారంటీ ఈవీ కొనుగోలుదారులు తమ స్కూటర్ బ్యాటరీల దీర్ఘకాలిక ఆరోగ్యానికి సంబంధించి ఏవైనా ఆందోళనలు,వ్యాకులతను తొలగిస్తుందని మేము విశ్వసిస్తున్నాము’’ అని తెలిపారు.

రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ సీఈఓ రాకేష్ జైన్ మాట్లాడుతూ, “రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌లో  వినియోగదారుల సంతృప్తి, మనశ్శాంతిని పెంపొందించే ఆవిష్కరణలకు మేము కట్టుబడి ఉన్నాము. ఏథర్‌తో మా భాగస్వామ్యం ఈవీ యజమానులకు దీర్ఘకాలిక రక్షణను అందించాలనే మా భాగస్వామ్య దృష్టిని ప్రతిబింబిస్తుంది.

ఈవీ పర్యావరణ వ్యవస్థపై నమ్మకాన్ని పెంపొందించడంలో, స్థిరమైన చలనశీలతను స్వీకరించేందుకు మరింత మంది వ్యక్తులను ప్రోత్సహించడంలో ఈ చొరవ కీలక పాత్ర పోషిస్తుందని మేము విశ్వసిస్తున్నాము’’ అని తెలిపారు.

ఏథర్  బ్యాటరీలు బ్యాటరీ  మన్నిక, సురక్షత,రైడర్‌లకు భద్రతను నిర్ధారించేందుకు ఉష్ణోగ్రత పరీక్ష, మెకానికల్ డ్రాప్ టెస్టింగ్,తీవ్ర వైబ్రేషన్ పరీక్షలతో సహా 272 పరీక్షలకు లోనవుతాయి.

ఏథర్  అంతర్నిర్మిత బ్యాటరీ నిర్వహణ వ్యవస్థ బ్యాటరీ ప్యాక్‌లోని అన్ని సెల్‌లకు కనెక్ట్ చేయబడి, వాటి వోల్టేజ్,కరెంట్‌ని నిరంతరం కొలుస్తుంది. ప్యాక్‌లో ఉంచిన బహుళ ఉష్ణోగ్రత సెన్సార్‌లు కూడా బ్యాటరీ ప్యాక్‌లోని వివిధ విభాగాలలో ఉష్ణోగ్రతలతో బీఎంఎస్‌కు నిరంతరం వివరాలు అందిస్తుంది. బ్యాటరీ ప్యాక్‌లోని సెల్‌లు సురక్షితమైన ఆపరేటింగ్ విండోలో పని చేసేలా ఇది సహాయపడుతుంది.

ఏథర్ రెండు విభిన్నమైన స్కూటర్‌లను కలిగి ఉంది – 450 రిజ్టా కాగా, ఇవి విభిన్న విభాగాలకు సేవలు అందిస్తాయి. ఈ రెండు స్కూటర్‌ల శ్రేణికి కొత్తగా ప్రవేశపెట్టిన Eight70TM వారంటీతో సహా ఏథర్  పొడిగించిన బ్యాటరీ వారంటీ ఎంపికలు మద్దతునిస్తున్నాయి.

ఏథర్  450 శ్రేణి స్కూటర్‌లలో 450X, 450S,450 అపెక్స్  ఉండగా, అవి ఈ విభాగంలో పనితీరును చూపిస్తున్నాయి. ఏథర్  తాజా ఆఫరింగ్ – రిజ్టాను ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేయగా, ఇది కుటుంబం మొత్తం వినియోగించుకునేలా తయారు చేశారు.

ప్రో-ప్యాక్‌ను కలిగి 5-ఏళ్ల బ్యాటరీ వారంటీ కన్నా ఎక్కువ అంతకన్నా ఎక్కువ 3 ఏళ్ల యాడ్-ఆన్‌గా బ్యాటరీ కోసం Eight70TM వారంటీని కొనుగోలు చేయవచ్చు. ప్రో-ప్యాక్‌ను ఎంచుకున్న ఏథర్ 450 సిరీస్,ఏథర్ రిజ్టా కొనుగోలుదారులకు జీఎస్‌టీతో సహా దీని ధర రూ.4,999.

error: Content is protected !!