365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు 13,2024: యువతే దేశ నిర్మాణకర్తలని మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ డైరెక్టర్ డా.హిప్నో పద్మా కమలాకర్, టిచర్ అన్నపూర్ణ, జి.కృష్ణవేణి అన్నారు.

ఆగస్టు 12న అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా రామకృష్ణ మఠంలో యోగా నంద రఘుమహారాజు, నవ, వనితా భారత లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమ వారం బాలల సేవా విభాగంలో పిల్లలు – చదువు అనే అంశంపై ఉపన్యాస పోటీలు నిర్వహించారు.

పోటీలో గెలిచిన పిల్లలకు బహుమతులు, నోట్ బుక్స్, వ్యక్తిత్వ వికాస పుస్తకాలను పిటి టిచర్ అన్నపూర్ణ,జి.కృష్ణవేణీ, టి.శోభారాణి,ఆరతి, బి.వనిత ,డా.హిప్నో పద్మా కమలాకర్ అందజేశారు .

ఆమె మాట్లాడుతూ యువత సమస్యలపై అవగాహన కల్పించడంలో సహాయపడటానికి UN ద్వారా అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని రూపొందించారన్నారు.

ఆరు నుండి 13 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న సగం మంది పిల్లలకు ప్రాథమిక పఠనం, గణిత నైపుణ్యాలు లేవన్నారు . బాల్య పేదరికం ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రబలంగా ఉన్న సమస్యేనని ఆవేదన వ్యక్తంచేశారు. యువతకు సమస్యల పై అవగాహన ఉంటే పరిష్కారం సులభమన్నారు.

ఓబుల్ రెడ్డి స్కూల్ పిటి టిచర్ అన్నపూర్ణ మాట్లాడుతూ యువత సంఘటితం కావడమే వారి అజేయమైన శక్తిని చెప్పారు. ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండేందుకు ఆటలు అడతాం,ఇతర కార్యక్రమంలో పాల్గొంటాం అని ప్రతిజ్ఞ చేయించారు.

జి.కృష్ణవేణి మాట్లాడుతూ బాలలు మంచి పౌరులుగా ఎదగడం చదువు ద్వారానే సాధ్యమని చెప్పారు.

*మొదటి బహుమతి పొందిన సంతోష్ మాట్లాడుతూ ప్రత్యేక సందర్భాలు వున్న రోజుల్లో పోటీలు పెట్టి మేము ఎన్నో విషయాలను తెలుసుకునేలా చేస్తున్న పద్మా కమలాకర్, కృష్ణ వేణి మేడం లకు నా ధన్యవాదాలు అని తెలిపాడు.

ఈ కార్యక్రమంలో ఓబుల్ రెడ్డి స్కూల్ పిటి టిచర్ అన్నపూర్ణ, వనితా భారత్ లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు జి.కృష్ణవేణీ, టి.శోభారాణి,ఆరతి, బి.వనిత విద్యార్థులు పాల్గొన్నారు.