Tue. Dec 24th, 2024
Hypno padma Kamalakar,

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అమరావతి, డిసెంబర్ 11,2022: సైకాలజీ రంగానికి ఊపిరిపోసి ఓ ధైర్యం.. ఓ భరోసా ఇచ్చిన మహ నీయుడు హిప్నో కమలాకర్ అని ఇండియన్ మెడికల్ అసోసి యేషన్ పూర్వ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జి. సమరం అన్నారు.

మానసిక సమస్యలు ఇలా ఉంటాయని ఆయన తెలి యజేశారన్నారు. ప్రస్తుతం ఆయన లేకపో వడంతో ఆ లోటు కనిపిస్తోందని ఆవే దన వ్యక్తం చేశారు.

జాతీయ ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం సీతారాంపురంలోని ఐకాన్ పబ్లిక్ స్కూల్లో ఒక్క రోజు జాతీయ స్థాయి శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు.

శిబిరానికి డాక్టర్ జి. సమరం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాల్యాన్ని, జీవితాన్ని చిదిమేస్తున్న ముఠాల దాష్టీకం సమాజానికి పెను సవాలుగా మారుతోందని ఆయన పేర్కొన్నారు.

ఆనందం, సంతోషాన్ని కలిగించడమే కాకుండా ఆరోగ్యం, సంబంధాలపై శృంగారం గణనీయమైన ప్రభావం చూపిస్తోందని, ఆయన అన్నారు. శృంగార లేమితో రక్త పోటు, నిద్రలేమి, మతిమరపు వంటి మానసిక సమస్యలు వస్తాయన్నారు. పిల్ల లకు తల్లిదండ్రులు టీనేజ్ వయసులో ఏర్పడే సెక్స్, సెక్సువాలిటీ ప్రభావాలను వివరించాలన్నారు.

Hypno padma Kamalakar,

జాతీయ ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్ మాట్లాడుతూ లైంగిక వేధింపులు, ర్యాగింగ్ పర్యవసానాలపై కఠిన చర్యలు తీసుకోవా లన్నారు. ప్రతి కళాశాలలో సైకాలజిస్ట్ లను నియమించాలని డిమాండు చేశారు.

ఏపీ లోని పలు జిల్లా ల్లోని సైకాలజిస్ట్ లకు సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జి. సమరంను సైకా లజిస్ట్ లు ఘనంగా సత్కరించారు.

స్కూల్ ప్రిన్సిపల్ ప్రవీణ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి. వీరభద్రం, డాక్టర్ వి. జనార్ధనం, డాక్టర్ పి. రమేష్ కుమార్, డాక్టర్ ఇ. షహీనా, డాక్టర్ పి. లలితాదేవిల పర్యవేక్షణలో కార్యక్ర మాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సైకాలజిస్ట్లు మల్లికార్జున దీక్షితులు, డాక్టర్ శ్రీనివాస్, కె. చిన్నవాడు, వాసుదేవరావు, వై. సురేష్బాబు, సైకాలజీ విద్యా ర్థులతో పాటు ఉపాధ్యాయులు, అధ్యాప కులు, న్యాయవాదులు, సామాజిక సేవా కార్యకర్తలు, భార్యాభర్తలు, యువత పాల్గొన్నారు.

error: Content is protected !!