365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఆగస్టు 29, 2025:విద్యపై దృష్టి సారించిన అగ్రగామి నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) అవాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, దేశంలోని ప్రముఖ జీవన బీమా సంస్థ HDFC లైఫ్ తో వ్యూహాత్మక భాగస్వా365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఆగస్టు 29, 2025:విద్యపై దృష్టి సారించిన అగ్రగామి నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) అవాన్స్ ఫైనాన్షియల్ మ్యం ప్రకటించింది. ఈ ఒప్పందం ద్వారా అవాన్స్ విద్యాసంస్థల రుణగ్రాహులు HDFC లైఫ్ అందించే రిటైల్,గ్రూప్ క్రెడిట్ లైఫ్ ఇన్షూరెన్స్ పరిష్కారాల ద్వారా మరింత భద్రత పొందనున్నారు.

అవాన్స్ లక్ష్యం ప్రతి అర్హత కలిగిన భారతీయ విద్యార్థికి సులభంగా, అందుబాటులో విద్యా రుణాలు అందించడం. ప్రత్యేకంగా రూపొందించిన ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ లోన్ సొల్యూషన్స్ ద్వారా పాఠశాలలు, కళాశాలలు తమ మౌలిక సదుపాయాల విస్తరణ, వర్కింగ్ కేపిటల్ అవసరాలు, విస్తరణ ప్రాజెక్టులు,అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధులు పొందగలవు. దీని ఫలితంగా విద్యా నాణ్యత,ప్రాప్తి మరింత బలపడుతుంది.

ఈ భాగస్వామ్యం ద్వారా అవాన్స్ కస్టమర్ ఫస్ట్ దృక్పథం , HDFC లైఫ్ ఉత్పత్తుల విస్తృత శ్రేణి, ఆధునిక టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌లు, బలమైన సేవలు, ఉన్నత క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో కలిసివి వినియోగదారులకు విలువైన పరిష్కారాన్ని అందిస్తాయి. దీని ద్వారా సంస్థలు, వ్యక్తులు అనుకోని ఆర్థిక సవాళ్లనుంచి రక్షించబడటమే కాకుండా, జీవిత బీమా వారి ఆర్థిక భద్రతకు అంతర్భాగమవుతుంది.

Read This also…Avanse, HDFC Life Join Hands for Education Loan Protection..

అవాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ అమిత్ గైందా మాట్లాడుతూ –“మా లక్ష్యం ప్రతీ విద్యార్థికి విద్యా రుణాలను సులభతరం చేసి, భారత విద్యా వ్యవస్థ వృద్ధిని వేగవంతం చేయడం. HDFC లైఫ్‌తో భాగస్వామ్యం ద్వారా మా విద్యాసంస్థ రుణగ్రాహులకు మరింత ఆర్థిక భద్రత లభిస్తుంది. సమగ్ర రక్షణ పరిష్కారాలను మా ఆఫరింగ్స్‌లో చేర్చడం ద్వారా, సంస్థలు తమ దృష్టిని విద్యా నాణ్యతపై కేంద్రీకరించగలవు. వారి ఆర్థిక స్థిరత్వం, భవిష్యత్ రక్షణపై మేము దృష్టి పెడతాం” అని తెలిపారు.

HDFC లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ విభా పడల్కర్ మాట్లాడుతూ –
“మా ప్రధాన లక్ష్యం కస్టమర్ల ఆర్థిక భద్రత. అవాన్స్‌తో భాగస్వామ్యం ద్వారా దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో కీలకపాత్ర పోషించే విద్యాసంస్థలకు బలమైన రక్షణ వలయం అందించగలుగుతున్నాం. రుణరంగంలో వారి అనుభవం, దేశవ్యాప్త ఉనికి, మా పరిధిని విస్తరించడంలో మాకు తోడ్పడుతుంది” అని అన్నారు.

విద్యకు కట్టుబడి పనిచేస్తున్న సంస్థగా అవాన్స్, భారతదేశం ,విదేశాలలో ఉన్నత విద్య కోరుకునే విద్యార్థుల నుంచి , ఆధునికీకరణ లక్ష్యంగా పెట్టుకున్న విద్యాసంస్థల వరకు అందరికీ ఆర్థిక సహకారం అందిస్తోంది. మార్చి 31, 2025 నాటికి అవాన్స్ దాదాపు 2,000 విద్యాసంస్థలకు నిధులు అందించి, వారి మౌలిక సదుపాయాలను బలోపేతం చేసి, నాణ్యమైన విద్యను పెద్ద స్థాయిలో అందించే అభ్యాస వాతావరణాన్ని నిర్మించింది.