365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 19, 2021:అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రిలో క్రిస్మస్ సంబరాలను ఆనందంగా నిర్వహించుకున్నారు. సంస్థలోనే క్రికెట్, బ్యాడ్మింటన్ లాంటి పలు ఆటలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలనూ నిర్వహించారు.
ఈ సందర్భంగా అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రి సీఓఓ డాక్టర్ సత్వీందర్ సింగ్ సభర్వాల్ మాట్లాడుతూ, “క్రిస్మస్ అంటేనే పండుగ, సంబరాలు. కరోనా మహమ్మారి గత రెండేళ్లుగా అన్నింటినీ బాగా ఇబ్బందికరం చేస్తోంది. ఈ సమయంలో సంతోషాన్ని పంచుకోవడం చాలా ముఖ్యం. అన్నిరకాల రక్షణ చర్యలు తీసుకుంటూనే రోగులకు చికిత్సలు చేయడంతో పాటు… వారి ముఖాల మీద మంచి చిరునవ్వులు పూయించడానికి కావల్సినవి కూడా చేస్తున్నాం” అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో క్రిస్మస్ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రపంచ రక్షకుడిని హృదయపూర్వకంగా స్వాగతించాల్సిన సమయమిది. పాటలు, డాన్సులు, ఇతర అన్నిరకాల వినోద కార్యక్రమాలతో క్రిస్మస్ సంబరాలు చేసుకున్నాం. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర సిబ్బంది, రోగులు కూడా ఈ సంబరాల్లో ఆనందంగా పాల్గొన్నారు.